Sivatmika Rajasekhar: మూడో సినిమా పట్టేసిన జీవిత రాజశేఖర్ తనయ!
- June 30, 2021 / 02:41 PM ISTByFilmy Focus
జీవిత-రాజశేఖర్ తనయ శివాత్మిక కోలీవుడ్‌లో వరుసగా రెండో ఛాన్స్ కొట్టేసింది. అందులోనూ చేస్తున్న తొలి సినిమా ఇంకా విడుదల కాకముందే ఛాన్స్ సంపాదించడం విశేషం. ప్రస్తుతం శివాత్మిక ‘ఆనందమ్ విలయాడుమ్ వీడు’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా త్వరలో విడుదల కావాల్సి ఉంది. ఈలోగా మరో సినిమాలో శివాత్మిక నటించేందుకు ఛాన్స్ సంపాదించిందని సమాచారం. ఆనంద్ దేవరకొండ హీరోగా చేసిన ‘దొరసాని’ సినిమాతో శివాత్మిక హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.
సినిమా ఫలితం నిరాశపరిచినా… తన నటనకు మంచి మార్కులే వచ్చాయి. అయితే ఆ తర్వాత వరుసగా అవకాశాలు వస్తాయని అని అందరూ అనుకున్నారు. అయితే కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న ‘రంగ మార్తాండ’లో మాత్రమే అవకాశం సంపాదించింది. అయితే తమిళంలో మాత్రం వరుసగా ఛాన్స్‌లు సంపాదిస్తోంది. ఆర్.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఓ తమిళ చిత్రంలో శివాత్మికను హీరోయిన్‌గా తీసుకున్నారట. ‘ఆనందమ్ విలయాడుమ్ వీడు’లో శివాత్మిక నటనను చూసిన ఆర్.కార్తిక్ టీమ్…

శివాత్మికను తమ సినిమాలో ఎంచుకున్నారట. త్వరలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని సమాచారం. ‘రంగ మార్తాండ’ వచ్చాక ఇక్కడ కూడా శివాత్మికకు వరుస అవకాశాలు వస్తాయేమో చూడాలి.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!











