సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో రానున్న సినిమాఫై అంచనాలు పెరిగిపోతున్నాయి. మహేష్ తొలి సారి తమిళం, తెలుగులో చేస్తున్న సినిమా కావడంతో నటీనటుల ఎంపికలో జాగ్రత వహిస్తున్నారు. తమిళ దర్శకుడు, నటుడు అయిన సూర్య విలన్ పాత్ర చేయడానికి అంగీకారం తెలిపాడు. ఇతను ఇది వరకు తెలుగులో ఖుషి సినిమాని డైరక్ట్ చేసాడు. ఆ సినిమాలోనే కాసేపు కనిపించాడు. తమిళంలో హీరోగా నటించి మెప్పించాడు. ఇప్పుడు విలన్ పాత్రకు సై అన్నాడు. ఇతన్ని విలన్ గా నటింప చేయడం వల్ల తమిళంలో సులువుగా ప్రమోషన్ చేయవచ్చని చిత్ర బృందం భావిస్తోంది.
మురుగదాస్ కి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి ఈ సినిమాను హిందీలోనూ డబ్ చేయనున్నారు. అక్కడి ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికి కనెక్ట్ అయ్యేలా నేటి బాలీవుడ్ సుందరి పరిణీత చోప్రాను తీసుకున్నారు. సామాజిక సమస్యల నేపధ్యంలో సాగే ఈ కథకు హరీష్ జయరాజ్ స్వరాలను అందించనున్నారు. ప్రస్తుతం లండన్ టూర్ లో ఉన్న మహేష్ బాబు హైదరాబాద్ కి తిరిగి రాగానే చిత్రీకరణ పనులు మొదలు కానున్నట్లు నిర్మాతలు టాగూర్ మధు, ఎన్ వీ ప్రసాద్ లు చెప్పారు.