Miss Shetty Mr Polishetty: ఈ వారం కూడా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’..దే హవా..ఎందుకంటే?

నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా గత వారం రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ‘జవాన్’ చిత్రం హవా ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ సినిమా చాలా బాగా పికప్ అయ్యింది. ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల బయ్యర్స్ అంతా.. చాలా వరకు సేఫ్ జోన్లోకి వచ్చేశారు. ఓవర్సీస్ బయ్యర్స్ అయితే భారీ లాభాలు అందుకున్నారు.

సినిమాకి అయిన బడ్జెట్ దృష్ట్యా .. వచ్చిన కలెక్షన్స్ ఎక్కువే అనే కామెంట్స్ ట్రేడ్ పండితుల నుండి వినిపిస్తున్న సమాచారం. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే… మొదటి 4 రోజులు ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కంటే ‘జవాన్’ కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి. అయితే నిన్న 5 వ రోజున ‘జవాన్’ కంటే కూడా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కలెక్షన్స్ ఎక్కువగా కనిపించాయి.

దాదాపు మొదటి రోజు రేంజ్లోనే ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కలెక్ట్ చేసింది. ఈ గ్రోత్ ను బట్టి చూస్తుంటే.. రెండో వీకెండ్లో కూడా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఎక్కువగా కలెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘స్కంద’ ‘చంద్రముఖి 2 ‘ వంటి సినిమాలు పోస్ట్ పోన్ అవ్వడం.. అలాగే ఒక్క ‘మార్క్ ఆంటోనీ’ తప్ప పెద్దగా క్రేజ్ ఉన్న సినిమాలు రిలీజ్ లేకపోవడంతో ఈ సినిమాకి (Miss Shetty Mr Polishetty) మరింత కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus