Skanda OTT: అనుకున్న తేదీ కంటే ముందుగానే రీలిజ్ కానున్న స్కంద..!

ఎనెర్జిటిక్ స్టార్ రామ్ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన క్రేజీ మూవీ ‘స్కంద’ రీసెంట్ గానే విడుదలై డివైడ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ద్విపాత్రాభినయం లో రామ్ అద్భుతంగా నటించినప్పటికీ, బోయపాటి శ్రీను ఓవర్ మాస్ టేకింగ్ మరియు థమన్ సంగీతం వల్ల సినిమాకి నెగటివ్ టాక్ వచ్చింది. కానీ క్రేజీ కాంబినేషన్ అవ్వడం తో సినిమాకి అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి.

ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 47 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరగగా, 32 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక హిట్ టాక్ వచ్చి ఉంటే ఈ సినిమాకి అఖండ కి మించిన వసూళ్లు వచ్చి ఉండేవి. మంచి అవకాశం ని ఈ కాంబినేషన్ మిస్ చేసుకుంది. 15 కోట్ల రూపాయలకు పైగా లాస్ అంటే పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అనే చెప్పాలి.

ఇకపోతే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ఫ్యాన్సీ రేట్ కి డిస్నీ + హాట్ స్టార్ ఓటీటీ వారు ఎప్పుడో కొనుగోలు చేసారు. సినిమా విడుదలైన మూడు నెలల తర్వాతే స్ట్రీమింగ్ చెయ్యాలి అనేది ఒప్పందం. కానీ ముందుగానే ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసుకునే అవకాశం ఇస్తే ముందు అనుకున్న రేట్ కంటే డబుల్ ఇస్తామని చెప్పారట. అందుకే ఇప్పుడు ఈ చిత్రాన్ని (Skanda) డిస్నీ+హాట్ స్టార్ వాళ్ళు అక్టోబర్ 27 వ తారీఖున స్ట్రీమింగ్ చెయ్యడానికి సిద్ధపడ్డారు.

థియేటర్స్ లో పెద్దగా ఆదరణ దక్కించుకొని ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ని అలరిస్తుందో లేదో చూడాలి. బోయపాటి శ్రీను సినిమాలు థియేటర్స్ లో ఆడినా, ఆడకపోయినా డిజిటల్ మరియు సాటిలైట్ స్ట్రీమింగ్ చేసినప్పుడు మాత్రం మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. ఆయన డిజాస్టర్ ఫ్లాప్ చిత్రం ‘వినయ విధేయ రామ’ టీవీ టెలికాస్ట్ లో బంపర్ హిట్. అలా ఈ సినిమా కూడా బుల్లితెర ఆడియన్స్ ని అలరిస్తుందో లేదో చూడాలి.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus