లేటైనా కానీ చిన్న సినిమాల జోరు పెరిగింది!

  • July 1, 2019 / 06:17 PM IST

ఈ సంవత్సరం పెద్ద సినిమాలు రెండే రెండు విడుదలయ్యాయి. ఇందులో ఒకటి రాంచరణ్ హీరోగా వచ్చిన ‘వినయ విధేయ రామా’ కాగా మరొకటి మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘మహర్షి’ చిత్రం మరొకటి. వీటిలో ‘వినయ విధేయ రామా’ చిత్రం పెద్ద డిజాస్టర్ కాగా ‘మహర్షి’ చిత్రం హిట్టయ్యింది. అయినప్పటికీ ‘మహర్షి’ చిత్రానికి ఓవర్సీస్, సీడెడ్, నెల్లూరు వంటి ఏరియాల్లో నష్టాలు వచ్చాయి. దీనికి కారణం పెద్ద మొత్తంలో సినిమాని కొనుగోలు చేయడమే. పెద్ద హీరో కాబట్టి అలా పెద్ద రేట్లు పలుకుతుంటాయి. కానీ చిన్న సినిమాలు అలా కాదు.

ఈ సంవత్సరం చిన్న సినిమాల హడావిడి ఏమీ కనిపించడం లేదు అనుకుంటుంటే.. విశ్వక్సేన్ నటించిన ‘ఫలక్ నుమా దాస్’ చిత్రం వచ్చింది. మాస్ సెంటర్స్ లో ఈ చిత్రం పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కితెచ్చింది. ఇక ‘మల్లేశం’ చిత్రం కూడా కోటి రూపాయల లోపే బడ్జెట్ తో తెరకెక్కింది. ఫలితం పెట్టిన పెట్టుబడి వెనక్కి రాబట్టడంతో పాటు ఓ మంచి సినిమా, నిజాయితీ గల ప్రయత్నం అంటూ ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఇక థ్రిల్లర్స్ కరువయ్యాయి అనుకునే తరుణంలో నవీన్ పోలిశెట్టి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ సినిమా వచ్చి ఆ లోటును కూడా తీర్చేసింది. హీరో తో పాటు డైరెక్టర్ కి వరుస ఆఫర్లు వస్తున్నాయి.

ఇక రెండో వారంలో కూడా ఈ చిత్రానికి మంచి కలెక్షన్లు వస్తుండడం విశేషం. ఇక శ్రీవిష్ణు ‘బ్రోచేవారెవరురా’ చిత్రం ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘కల్కి’ వంటి క్రేజీ చిత్రం పక్కన వచ్చిన ఈ చిత్రం రెండో రోజు నుండీ భారీ వసూళ్ళు రాబడుతుంది. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ కు ఆడియన్స్ విజిల్స్ వేస్తున్నారు. కాస్త లేటైనా కానీ ఇప్పుడు చిన్న సినిమాలు జోరందుకుంటున్నాయనే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus