క్యాస్టింగ్ కౌచ్… ‘మీటూ’ ల గురించి ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. కొంతమంది నటీమణులు కెరీర్ ప్రారంభంలో తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను గురించి మీడియా ముందుకు లేదా సోషల్ మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పడం. ఇప్పటికే చాలా మంది నటీమణులు ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా పాపులర్ చేశారు. అయితే వీరిలో ఎక్కువ శాతం ఫేడౌట్ అయిపోయిన నటీమణులు లేదా ఫేడౌట్ దశకు దగ్గరగా ఉన్న నటీమణులే కావడం ఆలోచింపచేసే విషయం.
ప్రస్తుతం ఫామ్లో ఉన్న నటీమణులు అయితే అలాంటి అనుభవాలు తమకి ఎదురుకాలేదని.. అలాంటివి ఎదురైతే వెంటనే ధైర్యంగా స్పందించగలం అంటూ చెప్పి.. సేఫ్ గేమ్ ఆడేస్తుంటారు.తాజాగా ఓ బుల్లితెర నటి ప్రముఖ దర్శకుడి పై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. బాలీవుడ్ కు చెందిన బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ.. ‘మాకు ఓ సీరియల్ లేదా షో పూర్తి చేశాక అసలైన కష్టం మొదలవుతుంది. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అప్పుడు నాకు కట్టుకునే బిల్స్, ఇ.ఎమ్.ఐ వంటివి చాలా ఉంటాయి.నా చేతిలో చిల్లిగవ్వ కూడా లేని టైములో ఎన్నో ఇబ్బందులు పడుతూ, తీవ్ర ఒత్తిడికి, విమర్శలకి లోనవుతున్న టైములో ఓ ఆఫర్ వచ్చింది.ఆడిషన్ కు వెళ్తే.. ‘నువ్వు దర్శకుడితో ఒక రాత్రంతా గడిపితే నీకు మంచి పాత్ర గ్యారెంటీ!’ అని ఒక వ్యక్తి అన్నారు.
నన్నే ఎందుకిలా అడుగుతున్నారని ప్రశ్నిస్తే… ‘నువ్వొక తెలివైన అమ్మాయివని జవాబిచ్చాడు. అప్పటికి ‘మీటూ’ మూమెంట్ లేదు. ఇలాంటి ఆఫర్స్ ఇచ్చేవాళ్ళు… ఇండస్ట్రీలో ఇదంతా కామన్ అని చెబుతుంటారు. మీరు అంగీకరించనంత మాత్రాన కెరీర్లో మీరు నష్టపోయేదేమీ ఉండదు. అయితే వాళ్ళు మాత్రం మన కెరీర్ నాశనం చేస్తామని చెబుతుంటారు. అలాంటి వాళ్ళ ఆఫర్లకి, బెదిరింపులకు నేను లొంగలేదు.. కాబట్టి నేను ఆ విషయాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోను’ అంటూ దివ్యాంక త్రిపాఠి చెప్పుకొచ్చింది.