బిగ్ బాస్ హౌస్ లో ఈవారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో భాగంగా పాము నిచ్చెనల గేమ్ ని డిజైన్ చేశాడు బిగ్ బాస్. ఇందులో హౌస్ మేట్స్ రెండు టీమ్స్ గా విడిపోయి వేర్ హౌస్ నుంచీ వచ్చిన మట్టిని తీస్కోవాలి. ఆ మట్టితో నిచ్చెనలు, పాములు కట్టాల్సి ఉంటుంది. ఇక పాము బుసల సౌండ్ వచ్చినపుడు పాము నుంచీ ఒక టీమ్ మెంబర్ నిచ్చెన కట్టే ఒక టీమ్ మెంబర్ ని ఎంచుకుని ఎటాక్ చేస్తూ మట్టిని తీస్కుని నిచ్చెనని పాడుచేయాలి.
అలాగే డైస్ శబ్దం వినిపించినపుడు నిచ్చెన టీమ్ నుంచీ ఒకరు పాము టీమ్ సభ్యుల్లో ఒకరిని ఎంచుకుని పాముని పాడుచేస్తూ మట్టిని తీస్కోవాలి. మొదటి రౌండ్ లో పాము టీమ్ లో ఉన్న కీర్తి , నిచ్చెన టీమ్ లో రాజ్ ని ఎంచుకుంది. ఇద్దరూ చాలాసేపు కలయబడ్డారు. కీర్తి వేలు బాగోకపోయినా రాజ్ తో పోరాడింది. రాజ్ కీర్తిని చాలా చక్కగా హుందాగా హ్యాండిల్ చేశాడు. ఇద్దరూ గేమ్ ఆడుతున్నా కూడా ఎక్కడా హర్ట్ అవ్వకుండా ఆడారు. ఈ తర్వాత నిచ్చెన టీమ్ లో ఉన్న శ్రీసత్య వాసంతీతో పోరాడింది.
ఇద్దరూ నిజంగా పాముల్లాగానే గేమ్ ఆడారు. బుసలు కొడుతూ వాసంతీ రెచ్చిపోయింది. శ్రీసత్యని కిందపారేసి మరీ ఆపింది. ఒకరినొకరు పెనవేసుకుని మరీ గేమ్ ఆఢారు. ఒకానొకదశలో వాసంతీ శ్రీసత్య పైన పడుకుంది. అంతేకాదు, తన రెండు కాళ్లతో శ్రీసత్యని పాములా చుడుతూ బంధించింది. ఇది నిజంగా టాస్క్ లో హైలెట్ అయ్యింది. ఇద్దరూ గేమ్ లో పోటీపడ్డారు. కానీ, అనూహ్యంగా శ్రీసత్య నిచ్చెన సరిగ్గా లేనందుకు మొదటిరౌండ్ లోనే వెనుదిరిగింది.
అలాగే, పాముల టీమ్ లో రోహిత్ మొదటిరౌండ్ లోనే అవుట్ అయ్యాడు. ఇక ఫస్ట్ నుంచీ ఈ టాస్క్ లో రేవంత్, బాలాదిత్య మట్టిని బాగా కలక్ట్ చేశారు. ముఖ్యంగా రోహిత్ నిచ్చెనని బిల్డింగ్ కట్టినట్లుగా చాలా స్ట్రాంగ్ గా కట్టాడు. అందరికంటే ధృఢంగా రేవంత్ తన డయాస్ పై నిచ్చెన ఉండేలా చూసుకున్నాడు. అలాగే, శ్రీహాన్, బాలాదిత్య, ఫైమా, ఇంకా మెరీనాలు కూడా తమ డయాస్ లని కాపాడుకున్నారు.