Sneha: పెదన్నయ్య అలా ఇబ్బంది పెట్టాడని చెప్పిన స్నేహ.. ఏమైందంటే?

టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన స్నేహ పెళ్లి తర్వాత పరిమితంగా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. స్నేహకు ప్రేక్షకుల్లో క్రేజ్ ఇప్పటికీ భారీ స్థాయిలో ఉంది. అభినయ ప్రధాన పాత్రల్లో స్నేహ ఎక్కువగా నటిస్తున్నారు. అయితే ఒక ఇంటర్వ్యూలో స్నేహ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. తాను బాల్యంలో అనుభవించిన కష్టాల గురించి ఆమె వెల్లడించారు. తన పేరెంట్స్ కు నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు అని స్నేహ అన్నారు. కూతుళ్లలో తాను చిన్న అని నాకు బదులుగా కొడుకు పుడితే బాగుండేదని బామ్మ కోరుకుందని స్నేహ చెప్పుకొచ్చారు.

బామ్మ నా మొఖం చూడటానికి మూడు రోజులు ఇష్టపడలేదని స్నేహ వెల్లడించారు. బాల్యంలో మంచి నీళ్లు పక్కనే ఉన్నా సోదరులకు అందించాల్సి వచ్చేదని అదేమని అడిగితే మేము మగాళ్లం అని చెప్పేవారని స్నేహ చెప్పుకొచ్చారు. ఆడపిల్లలు ఇంటి పనులు చేయాలని షరతులు పెట్టేవారని స్నేహ తెలిపారు. నా పెద్దన్నయ్య బాగా ఇబ్బంది పెటేవాడని స్నేహ చెప్పుకొచ్చారు. పెద్దన్నయ్య అన్ని పనులు తానే చెయ్యాలని చెప్పేవాడని స్నేహ వెల్లడించారు.

స్నేహ (Sneha) రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది. స్నేహ కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. స్నేహ కెరీర్ పై ఫోకస్ పెడితే మాత్రం ఆమె వరుస ఆఫర్లతో బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. పలు యాడ్స్ లో కూడా స్నేహ మెరుస్తున్నారనే సంగతి తెలిసిందే. స్నేహకు ఇతర ఇండస్ట్రీలతో పోల్చి చూస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మంచి గుర్తింపు ఉంది. స్నేహను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

సోషల్ మీడియాలో సైతం స్నేహకు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం. స్నేహ కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్నేహకు బాగానే క్రేజ్ ఉంది. ప్రసన్నను అభిమానించే అభిమానులు స్నేహను సైతం ఎంతగానో అభిమానిస్తున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus