Sneha Ullal: హీరోయిన్ స్నేహ ఉల్లాల్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన స్నేహ ఉల్లాల్ తన తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ చిత్రంతో ఈమెకు వచ్చిన క్రేజ్ కారణంగా బోలెడన్ని ఆఫర్లు ఈమెను వెతుక్కుంటూ వచ్చాయి. అవన్నీ ఒప్పేసుకుని ఈమె తప్పు చేసిందని తర్వాత రియలైజ్ అయ్యింది.’నేను మీకు తెలుసా’, ‘కరెంట్’, ‘వరుడు’, ‘సింహా’, ‘అలా మొదలైంది’, ‘మడత కాజా’ వంటి చిత్రాల్లో నటించిన స్నేహా ఉల్లాల్‌కి ఇప్పుడు అవకాశాలు లేవు.

దాంతో ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా నగ్న ఫోటోలని షేర్ చేసి షాక్ ఇచ్చింది. ఈ ఫోటోల్లో కొంతమంది ఆడవాళ్ళు నగ్నంగా ఉండడం అలాగే వారిని పశువుల్ని ఉంచే స్థలంలో ఉంచి చిత్ర హింసలు పెట్టడం మనం గమనించవచ్చు. ‘తల్లిపాలు తాగడం మానేసాక కూడా పాల కోసం మూగ జీవాల పైనే ఆధార పడేవాళ్ళుగా మనుషులు ఉంటున్నారు. కాస్త మొక్కల ఆధారిత అదే వెజిటేరియన్ ఫుడ్ కు అలవాటు పడండి…’ అని పేర్కొంటూ క్రుయాలిటీ ఫ్రీ అనే ట్యాగ్ తో తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది.

అమ్మాయిల పై పశువుల్లా ప్రవర్తించకండి అనే అర్ధం వచ్చేలా ఆమె ఈ ఫోటోని షేర్ చేసినట్టు స్పష్టమవుతుంది. దీంతో కొంతమంది నెటిజన్లు స్నేహ ఉల్లాల్ ను ప్రశంసిస్తున్నారు.ఇక సినిమాల విషయానికి వస్తే మంచి పాత్రలు దొరికితే సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటించడానికి కూడా రెడీ అంటుంది ఈ అమ్మడు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus