శోభితా ధూళిపాళ… సినిమాల్లో తక్కువగా వార్తల్లో ఎక్కువగా నిలిచే హీరోయిన్ల జాబితాలో ఈ పేరు కూడా ఉంటుంది. వరుస సినిమాలు చేసేసి, వెళ్లిపోదాం అనుకునే రకం కాదు శోభిత… సరైన పాత్రలు, పేరు తీసుకొస్తాయనుకునే పాత్రలే చేస్తూ ఉంటుంది. అయితే ఓ కుర్ర స్టార్ హీరోతో ప్రేమలో ఉంది అంటూ పుకార్లు షికార్లు చేస్తుంటాయి. దానికి కారణం ఆ ఇద్దరూ షికార్లు చేయడమే. అయితే ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
తన తొలి ఛాన్స్ కోసం వెయ్యి ఆడిషన్స్ ఇవ్వాల్సి వస్తుందేమో అని అనుకునేదట తొలి రోజుల్లో శోభిత. అయితే ‘రామన్ రాఘవ్ 2.0’ సినిమా ఆడిషన్స్‌కి వెళ్లడంతో పరిస్థితి మారిపోయింది, వెయ్యి ఆడిషన్ల ఆలోచన కూడా పక్కకు వెళ్లిపోయింది. ఆ సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన శోభిత ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ‘గూఢచారి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది. తెలుగు భామ అయినప్పటికీ… మలయాళ, హిందీ భాషల్లోనూ తన నటనతో మెప్పించింది. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్‌లోను సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.
ఇంత ఎత్తుకు ఎదిగారు కదా తొలి రోజుల గురించి చెప్పండి అంటే… సినిమా ప్రపంచంలో నేనేమీ వారసత్వంగా అడుగుపెట్టలేదు. ఆడిషన్స్ ద్వారానే ఛాన్స్‌లు సంపాదించాను. సినిమాల్లో రాణించాలంటే నటన ముఖ్యం. నటన నేర్చుకుంటూ మూడేళ్లలోగా సినిమాల్లో ఛాన్స్ సంపాదించానలని గడువు పెట్టుకున్నాను. గడువు పూర్తయ్యే సరికే ‘రామన్ రాఘవ్ 2.0’ కోసం ఆడిషన్ ఇచ్చాను అని తొలి రోజులు గుర్తు చేసుకుంది. ఆ సినిమాకు ఆడిషన్‌కు వెళ్లేముందు ఈ ఛాన్స్ రాకపోతే వెయ్యి ఆడిషన్స్ ఇవ్వడానికి సిద్ధపడిందట.
ఆ ప్రాజెక్టు తనపై ఎంతో ప్రభావం చూపిందని చెప్పిన ఆమె కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నామినేట్ అయ్యానని చెప్పింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ నటనా ప్రాధాన్య పాత్రలను చేసుకుంటూ వస్తోంది. అవే తనను ప్రత్యేకంగా ప్రేక్షకులకు చూపించాయని చెబుతోంది (Sobhita Dhulipala) శోభిత. ప్రస్తుతం ఆమె చేతిలో ‘మంకీ మ్యాన్’ అనే ఇంగ్లిష్ సినిమా, ‘సితార’ అనే హిందీ సినిమా ఉన్నాయి.
జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!