‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ క్లోజింగ్ కలెక్షన్స్..!

‘జబర్దస్త్’ తో వచ్చిన క్రేజ్ తో హీరోగా మారాడు సుడిగాలి సుధీర్. అతను హీరోగా నటించిన మొదటి చిత్రం ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ ఈపాటికే టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పటికీ క్లోజింగ్ కలెక్షన్ల రిజల్ట్ ఈ మధ్యే బయటకి వచ్చింది. ధన్యా బాలకృష్ణ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి రాజశేఖర్ రెడ్డి దర్శకుడు. ‘శేఖరా ఆర్ట్ క్రియేషన్స్’ బ్యానర్ పై కె.శేఖర్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. 2019 డిసెంబర్ 28న ఈ చిత్రం విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.

‘ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నప్పటికీ.. సెకండ్ హాఫ్ డైరెక్టర్ అంతగా ఎంగేజ్ చేయలేకపోయాడు..’ అనే కామెంట్స్ వినిపించాయి. అయితే కలెక్షన్ల విషయంలో ఈ చిత్రం పర్వాలేదనిపించిందనే చెప్పాలి. ఈ చిత్రానికి 1.8 కోట్లు (కరెక్టడ్) వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల వారి సమాచారం. ఇక ఫుల్ రన్ ముగిసే సరికి 1.46 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే 0.34 కోట్ల వరకూ బయ్యర్స్ నష్టపోయారు. ఇది తక్కువ నష్టమే కాబట్టి ఈ చిత్రాన్ని యావరేజ్ గా పరిగణించ వచ్చు.

Software Sudheer Movie 3 Days Collections1

ఎటువంటి ప్రమోషన్లు లేకుండా ‘వెంకీ మామ’ ‘ప్రతీరోజూ పండగే’ చిత్రాల మధ్యలో వచ్చి కూడా అంతమొత్తం కలెక్ట్ చేసింది అంటే గ్రేట్ అనే చెప్పాలి. సుధీర్ మొదటి సినిమాతో అయితే ఓకే అనిపించాడు. అమెజాన్ ప్రైమ్ లో కూడా ఈ చిత్రాన్ని బాగానే చూస్తున్నారు. లాక్ డౌన్ టైం కలిసి రావడంతో ఈ చిత్రం కొన్న టీవీ ఛానల్ వారికి కూడా కలిసొచ్చే అవకాశం ఉంది.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus