సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ పై కళ్యాణ్ కృష్ణ క్లారిటీ

ప్రస్తుతం రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన “ఆఫీసర్” సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న నాగార్జున.. ఆ సినిమా రిలీజ్ తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని తన కెరీర్ లో ఒన్నాఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అయిన “సోగ్గాడే చిన్ని నాయన” సినిమాకు సీక్వెల్ గా “బంగార్రాజు” సినిమాలో నటించనున్నాడని తెలుస్తోంది. ఈమేరకు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు. ఆల్రెడీ నాగార్జున స్క్రిప్ట్ ఒకే చేశాడని, ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ లాస్ట్ ఫేస్ లో ఉందని, జూలై నెలాఖరు లేదా ఆగస్ట్ లో రెగ్యులర్ షూట్ ఉంటుందని కన్ఫర్మ్ చేశాడు.

“సోగ్గాడే చిన్ని నాయన” ఎక్కడైనా ముగిసిందో.. సరిగ్గా అక్కడ్నుంచే “బంగార్రాజు” మొదలవుతుందని, ప్రీక్వెల్ లో నటించిన ఆర్టిస్టులందరూ.. సీక్వెల్ లోనూ కనిపిస్తారట. మొదటి భాగానికి రెండింతలు ఫన్ తో మలిభాగం తెరకెక్కనుందని, తప్పకుండా నాగార్జున కెరీర్ లో మరో కలికితురాయిగా నిలుస్తుందని పేర్కొన్నాడు కళ్యాణ్ కృష్ణ.
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన “నేల టికెట్టు” ఈ శుక్రవారం విడుదలవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus