Sohel: మేమంతా ఒకటే పిచ్చోళ్ళు అయ్యేది ఫ్యాన్స్ మాత్రమే!

బిగ్ బాస్ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే ఈరోజు జరిగినటువంటి రచ్చ పెద్ద ఎత్తున వివాదానికి కారణం అవుతుంది. పల్లవి ప్రశాంత్ అమర్ దీప్ అభిమానుల మధ్య గొడవ జరగడం, ఆ గొడవలో భాగంగా ప్రశాంత్ అభిమానులు అమర్ ప్రయాణిస్తున్నటువంటి కారుపై రాళ్ల దాడి చేయడమే కాకుండా ఆయన ఫ్యామిలీ గురించి బూతులు మాట్లాడుతూ కామెంట్లు చేశారు. ఇక ఈ విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది. కేవలం అమర్ కారు పై మాత్రమే కాకుండా ఇతర సెలబ్రిటీల కార్లపై కూడా రాళ్ల దాడి చేశారు.

అదేవిధంగా ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేశారు ఇలా అభిమానం ఉండాలి కానీ ఆ అభిమానం పరాకాష్టకు చేరకూడదు అంటూ ఎంతో మంది సెలబ్రిటీలు ఈ ఘటన గురించి మాట్లాడుతూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సోహెల్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ చేసినటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

అన్నపూర్ణ స్టూడియో వద్ద అభిమానుల మధ్య చోటు చేసుకున్నటువంటి గొడవలో భాగంగా అమర్ కారు పై దాడి చేసిన ఘటన గురించి ఈయన మాట్లాడుతూ అమర్ చాలా మంచోడు కాబట్టి ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన గురించి బూతులు మాట్లాడుతూ తన ఫ్యామిలీ పై నెగిటివ్ కామెంట్లు చేసి రాళ్ల దాడి చేసిన ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ నేను కనుక ఆ స్థానంలో ఉంటే ముందు అందరిని గుద్ది పడేసేవాడిని తర్వాత ఏమైనా చూసుకుందాం అనుకునేవాడిని నేను అమర్ అంత మంచోడిని కాదు అంటూ తెలిపారు.

కంటెస్టెంట్ల పట్ల అభిమానం ఉండాలి కానీ ఆ అభిమానం హద్దులు దాటకూడదని సోహెల్ తెలిపారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మేము కూడా ఇతర కంటెస్టెంట్లతో గొడవ పడే వాళ్ళం అది కేవలం హౌస్ వరకు మాత్రమే హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మేమంతా మంచి స్నేహితులుగా మారిపోయామని తెలిపారు. ఇలా ఈ గేమ్ షో తర్వాత మేమంతా మంచి స్నేహితులకు ఉంటామని చివరికి పిచ్చోళ్ళు అయ్యేది అభిమానులే అంటూ ఈ సందర్భంగా (Sohel) సోహెల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus