Sohel: నా పేరు చెప్పగానే ఫోన్ కట్ చేస్తున్నారు!: సోహెల్

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సోహెల్ ఒకరు. ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇటీవల మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మినహా మిగిలిన సినిమాలు ఏవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

ఇక త్వరలోనే సోహెల్ నటించిన బూట్ కట్ బాలరాజు సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సోహెల్ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంక్రాంతి పండుగ సందర్భంగా కొంతమంది స్టార్ హీరోలను నా (Sohel) సినిమాకు సపోర్ట్ చేయాలి అంటూ వారికి ఫోన్ చేశాను ఫోన్ లిఫ్ట్ చేయగానే సోహెల్ అనే పేరు చెప్పగానే ఫోన్ కట్ చేస్తున్నారని తిరిగి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని ఈయన తెలిపారు. వెంకటేష్ గారికి మాత్రమే తాను మెసేజ్ పెట్టానని ఆయన మాత్రం తనను ఎంకరేజ్ చేస్తూ తనకు ఆల్ ద బెస్ట్ చెప్పారని ఇలాంటి స్టార్ హీరో నాకు విష్ చేయడం చాలా సంతోషంగా అనిపించిందని తెలిపారు.

ఒక హిట్ కొట్టిన హీరోలు కూడా నాకు సపోర్ట్ చేయడానికి ముందుకు రాలేదు. అయితే ఎప్పుడు ఎవరి సక్సెస్ ఎలా ఉంటుందో తెలియదు అందుకే ఒకరికొకరు సహాయం చేసుకుందాం అంటూ ఈ సందర్భంగా సోహెల్ టాలీవుడ్ హీరోలను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags