కరోనా లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూత పడటంతో .. ఓటిటి సంస్థలే రాజ్యాలు ఏలుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు లాక్ డౌన్ ఎట్టేసినప్పటికి.. ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. పైగా సీట్ కు సీట్ మధ్య గ్యాప్..అంటున్నారు కాబట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు వచ్చే అవకాశం తక్కువ. వీకెండ్ మొత్తం ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు వస్తేనే కలెక్షన్లు పెద్ద మొత్తంలో నమోదు అవుతాయి. కానీ ఈసారి అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.
అందుకే మన దర్శక నిర్మాతలు ఎలాగైనా ప్రేక్షకులను థియేర్లకు రప్పించాలని అని విశ్వ ప్రయత్నాలు మొదలు పెట్టారు.ఈ క్రమంలో ఆల్రెడీ విడుదలైన సినిమాలను కూడా ఓటిటి లలో విడుదల చేయబోతున్నారు.ఇదిలా ఉండగా..సాయి తేజ్ హీరోగా నటిస్తున్న సోలో బ్రతుకే సో బెటర్ .. చిత్రాన్ని కూడా ఓటిటి లో విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోని థియేట్రికల్ రైట్స్ ను దిల్ రాజు మరియు యువి క్రియేషన్స్ వారు కొనుగోలు చేశారట.
ఆంధ్ర మరియు తెలంగాణ కలిపి సోలో బ్రతుకుకి 8కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 8.5 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన కొద్దిరోజులకే ఓటిటి లో కూడా విడుదల చేసుకునేలా డీల్ జరిగినట్టు భోగట్టా. మరి వాటి లావాదేవీల వివరాలు తెలియాల్సి ఉంది.
Most Recommended Video
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!