Tollywood: ఆ మూడు డిస్కషన్స్‌ ఆగాయి.. ఇంకొకటి కూడా ఆగిపోతే టాలీవుడ్‌లో ప్రశాంతత!

టాలీవుడ్‌కి (Tollywood) 2024 పెద్దగా అచ్చి రాలేదు అనే చెప్పాలి. అదేంటి మంచి విజయాలే వచ్చాయి కదా అని అనుకోవద్దు. ఎందుకంటే మేం చెప్పబోయేది ఇండస్ట్రీలో జరిగిన కొన్ని సంఘటనల గురించి. కావాలంటే మీరే చూడండి ఈ ఏడాది ప్రారంభమైంది మొదలు ఏదో విషయంలో టాలీవుడ్‌ పేరు వినిపిస్తూనే ఉంది. అయితే ఆ విషయాలు మంచివి కావు అనేదే ఇక్కడ మేటర్‌. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితిలో కామ్‌నెస్‌ కనిపిస్తుండటం గమనార్హం.

Tollywood

ఈ ఏడాది ప్రారంభంలో టాలీవుడ్‌ (Tollywood) యువ హీరో రాజ్‌ తరుణ్‌  (Raj Tarun)  వ్యక్తిగత జీవితం విషయంలో పెద్ద చర్చ మొదలైంది. అదే రాజ్ తరుణ్, లావణ్య వివాదం. రాజ్ తరుణ్ తనతో 11 ఏళ్లు సహజీవనం చేసి, పెళ్లి చేసుకొని ఇప్పుడు దూరం పెట్టాడు అనేది ఆమె వాదన. ఈ విషయంలో ఇద్దరూ కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఇద్దరూ మీడియాకెక్కారు ఊడా. అయితే ఇప్పుడు కోర్టు పరిథిలో కేసు ఉంది. మరోవైపు రీసెంట్‌గా ఈ విషయంలో ఎలాంటి చర్చా లేదు.

ఈ కేసు నడుస్తున్న సమయంలోనే ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్ (Jani Master) కేసు వచ్చింది. ఆయన దగ్గర గతంలో పని చేసిన మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించారని ఆమె ఆరోపణ. ఈ విషయంలో జానీ మాస్టర్‌ అరెస్ట్‌ అయ్యారు కూడా. ఇప్పుడు ఆయన బెయిల్‌ మీద బయట ఉన్నారు. మరోవైపు ఈ విషయం కోర్టు బయట తేల్చుకునే చర్చలు జరుగుతున్నాయని ఓ టాక్‌ నడుస్తోంది.

ఈ సమయంలోనే సీనియర్‌ నటి హేమ (Hema)  డ్రగ్స్ వివాదం బయటకు వచ్చింది. బెంగళూరులో జరిగిన ఓ పార్టీలో ఆమె డ్రగ్స్‌ తీసుకున్నారని.. ఆధారాలు ఉన్నాయని అక్కడి పోలీసులు చెప్పారు. ఈ మేరకు అదుపులోకి తీసుకోవడాలు కూడా జరిగాయి. ఈ క్రమంలో బెంగళూరు పోలీసులు, హేమ మధ్య ఓ సినిమా లాంటి వరుస సంఘటనలు జరిగాయి. ఇప్పుడు ఈ విషయంలో కూడా కామ్‌నెస్‌ కనిపిస్తోంది.

ఇవన్నీ తేలిపోయినా.. సోషల్‌ మీడియాలో అభిమానం పేరిట కొంతమంది చేస్తున్న అరాచకాలు కూడా ఆగిపోతే టాలీవుడ్‌లో ప్రశాంతత వస్తుంది. ఎవరు ఎవరిని ఎందుకు ట్రోల్‌ చేస్తున్నారు అనేది తెలియడం లేదు. ఏదో అనాలని కొందరు.. వాళ్లేదో అన్నారు మరికొందరు నోటికొచ్చింది అనేసుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus