ఆ ఫీట్ సాధించింది సాయి పల్లవి మాత్రమేనట..!

‘ఫిదా’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి.. తన సహజ నటనతో‌ అలాగే అదిరి పోయే డ్యాన్స్ స్టెప్స్ తో అందరి దృస్టిని ఆకర్షించింది. మరి ఈ హైబ్రిడ్ పిల్ల గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ప్రేమమ్’ చిత్రంతో పరిచయమయ్యింది కాబట్టి.. ఈమెది మలయాళం అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ ఈమె ఓ తమిళమ్మాయి. తమిళ నాడులోని కోటగిరి ప్రాంతంలో ఈమె జన్మించింది. ఈమె బడుగ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి. ఆ కమ్యూనిటీ నుండీ ఇంత టాప్ పొజిషన్ కు ఎదిగిన మొట్టమొదటి మహిళ సాయి పల్లవిని కావడం విశేషం.

‘ప్రేమమ్’ కంటే ముందే ఈమె ‘కస్తూరి మాన్’ ‘ధామ్ ధూమ్’ వంటి తమిళ చిత్రాల్లో నటించింది. ఇక సాయి పల్లవి జార్జియాలో మెడిసిన్ పూర్తి చేసింది. నటి కాకపోయి ఉంటే.. ఈమె కార్డియాలజిస్ట్ గా కొనసాగేదట. తమిళంలో ‘కస్తూరి మాన్’ ‘ధామ్ ధూమ్’ వంటి చిత్రాల్లో నటించిన సాయి పల్లవి.. ఆ తరువాత ‘ఢీ4’ సీజన్ లో కూడా పాల్గొంది. అయితే ఈమె ఆ డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చెయ్యడం ఈమె తల్లికి ఇష్టం లేదట. ఆమెను కన్విన్స్ చెయ్యడానికి సాయి పల్లవి చాలా కష్టపడిందట. ‘ప్రేమమ్’ దర్శకుడు ఆల్ఫోన్స్ ఈమెను సంప్రదించినప్పుడు.. ఆ చిత్రంలో ఈమెకు సైడ్ క్యారెక్టర్ ఇస్తాడేమో అనుకుందట. కానీ ఆ చిత్రంలో ఓ హీరోయిన్ పాత్ర ఇచ్చినందుకు చాలా సంతోషించిందట.

‘ప్రేమమ్’ సినిమా సెట్స్ లో ఉన్నప్పుడు.. ఆ చిత్రంలోని ‘మలరే’ అనే పాట పెడితే అది ఆమెకు బాగా నచ్చేసిందట. కానీ ఆ పాట ఈమె పై చిత్రీకరిస్తారు అని సాయి పల్లవి అస్సలు అనుకోలేదట. ఈమె డ్యాన్స్ కు సంబంధించి ఎటువంటి ట్రైనింగ్ తీసుకోలేదట. ఐశ్వర్య రాయ్, మాధురి దీక్షిత్ ల ఇన్స్పిరేషన్ తోనే సొంతంగా నేర్చుకుందట. ఎంత డబ్బు ఆఫర్ చేసినా వాణిజ్య ప్రకటనల్లో కానీ పాత్రకు ప్రాధాన్యత లేని సినిమాల్లోనూ అలాగే లిప్ లాక్ లు, గ్లామర్ షో ఎక్కువ చెయ్యాల్సిన సినిమాల్లో ఈమె నటించనని తేల్చి చెప్పేసింది.విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’… అలాగే మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల్ని కూడా ఈమె అందుకే రిజెక్ట్ చేసిందట.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus