Sonakshi Sinha Wedding: ఏడేళ్ల ప్రేమ బంధం.. ఇప్పుడు వివాహ బంధం.. సోనాక్షి పెళ్లి ఫొటోలు వైరల్‌.!

గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌ మీడియాలో, సోషల్‌ మీడయాలో తెగ వినిపిస్తున్న జోడీ పేరు సోనాక్షీ సిన్హా  (Sonakshi Sinha) – జహీర్‌ ఇక్బాల్‌ (Zaheer Iqbal) . ఇద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు? ఆ రోజు పెళ్లి, ఇక్కడ పెళ్లి, అక్కడ పెళ్లి అంటూ ఏవేవో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలన్నింటికీ ఫుల్‌ స్టాప్‌ పడింది. ఎందుకంటే రూమర్‌గా ఇన్నాళ్లూ వినిపించిన ఈ విషయం ఇప్పుడు నిజం అయిపోయిది. అవును సోనాక్షి సిన్హా – జహీర్‌ ఇక్బాల్‌ పెళ్లి చేసేసుకున్నారు.

‘హీరామండీ: ది డైమండ్‌ బజార్‌’ అనే వెబ్‌ సిరీస్‌తో ఇటీవల అలరించిన సోనాక్షి ఓ ఓటీటీ షోలో పాల్గొంటూ పెళ్లి గురించి ఇన్‌డైరెక్ట్‌గా మాట్లాడింది. ఇప్పుడు అందరూ తన పెళ్లి గురించే మాట్లాడుతున్నారని, త్వరలో ఈ విషయం తేల్చేద్దాం అని హోస్ట్‌తో అంది. ఏదో మాట వరసకు అందేమోలే అని అనుకున్నారంతా. కానీ ఆమె ఆ మాటల్ని నిజం చేసేసింది. తన మనసైనోడిని మనవాడింది.

సోనాక్షి సిన్హా – జహీర్‌ ఇక్బాల్‌తో ఆదివారం వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ప్రేమ పక్షుల్లా ఇన్నాళ్లూ ఉన్న ఈ ఇద్దరు రిజిస్టర్‌ మ్యారేజీ చేసుకున్నారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజు మేము ప్రేమలో పడ్డాం. అప్పటి నుండి ప్రేమను అలాగే నిలబెట్టుకున్నాం. ఆ రోజు పుట్టిన ప్రేమ ఇప్పుడు ఈ రోజు ఈ మధుర క్షణానికి దారి తీసింది. మా కుటుంబాల ఆశీర్వాదంతో, దేవుని ఆశీస్సులతో ఒక్కటయ్యాం అఇ పెళ్లి ఫొటోల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది సోనాక్షి.

‘డబుల్‌ ఎక్సెల్‌’ అనే సినిమాలో సోనాక్షి సిన్హా – జహీర్‌ ఇక్బాల్‌ కలసి నటించారు. సోనాక్షి పెళ్లికి తన తల్లి పూనమ్ సిన్హా చీర, నగల్ని ధరించింది. అయితే పెళ్లి గురించి వాళ్ల పెళ్లి హిందూ సంప్రదాయంలో జరుగుతుందా లేక ముస్లిం పద్ధతిలో జరుగుతుందా అనే చర్చ సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చే జరిగింది. ఈ నేపథ్యంలో ఏం ఆలోచించారో ఏమో.. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. శత్రుఘ్న సిన్హా ఇంట్లో అధికారుల సమక్షంలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్లి జరిగింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus