Sonali Bendre: ఆర్థిక ఇబ్బందుల వల్లే సినిమాలు చేస్తున్నా: సోనాలి బింద్రే

సోనాలి బింద్రే ఈ పేరు గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టాలీవుడ్, బాలీవుడ్ అంటూ ఇండస్ట్రీతో సంబంధం లేకుండా తెలుగు హిందీ తమిళ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న సోనాలి బింద్రే ఉన్నఫలంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి, శ్రీకాంత్, మహేష్, నాగార్జున వంటి అగ్ర హీరోలందరి సరసన నటించిన ఈమె క్యాన్సర్ బారిన పడ్డారు.

ఈ విధంగా క్యాన్సర్ బారిన పడటంతో సోనాలి బింద్రే ఇండస్ట్రీకి దూరమవుతూ విదేశాలకు వెళ్లి క్యాన్సర్ కోసం చికిత్స తీసుకున్నారు. ఇలా కొన్ని సంవత్సరాల పాటు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ విదేశాలలోనే ఉండిపోయారు. అయితే ప్రస్తుతం ఈమె క్యాన్సర్ నుంచి కోలుకోవడంతో ఇండియాకి వచ్చారు. ఇండియాకి తిరిగి వచ్చిన సోనాలి బింద్రే తిరిగి ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ముందులా కాకుండా ప్రస్తుతం తన వయసుకు తగ్గ పాత్రలో నటించడానికి ఈమె సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోని ది బ్రోకెన్ న్యూస్ అనే వెబ్ సీరీస్ ద్వారా ఈమె రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.ఈ క్రమంలోనే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన రీ ఎంట్రీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. గత కొంతకాలం నుంచి తన కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుందని,ఆర్థికంగా అంతగా బాగా లేకపోవడంతోనే తాను ఇండస్ట్రీలోకి రీ-ఎంట్రీ ఇచ్చానని ఈ సందర్భంగా ఈమె తెలిపారు.

కేవలం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికే తాను సినిమాల్లో నటిస్తున్నానని ఈ ఇంటర్వ్యూ ద్వారా సోనాలి బింద్రే క్లారిటీ ఇచ్చారు.ఇకపోతే కొరటాల శివ ఎన్టీఆర్ సినిమాలో సోనాలి బింద్రే నటిస్తుందని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఈమె క్లారిటీ ఇచ్చారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus