Sonali Bendre: ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చిన సోనాలి బింద్రే!

తెలుగులో తక్కువ సినిమాలే చేసినా స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో సోనాలి బింద్రే ఒకరు. ఇంద్ర, మన్మథుడు, ఖడ్గం, మురారి, మరికొన్ని సినిమాలు నటిగా సోనాలి బింద్రేకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కొన్నేళ్ల క్రితం సోనాలి బింద్రే క్యాన్సర్ బారిన పడగా ఎట్టకేలకు క్యాన్సర్ ను జయించారు. ప్రస్తుతం సోనాలి బింద్రే పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. ది బ్రోకెన్ న్యూస్ అనే వెబ్ సిరీస్ ద్వారా సోనాలి బింద్రే రీఎంట్రీ ఇచ్చారు.

జూన్ నెల 10వ తేదీన ఈ వెబ్ సిరీస్ జీ5 యాప్ లో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా సోనాలి బింద్రే మాట్లాడుతూ తన గురించి వైరల్ అయిన పుకార్లకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. తాను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నానని జరిగిన ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని ఆమె తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే మళ్లీ సినిమాల్లో నటిస్తున్నానని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని సోనాలి బింద్రే వెల్లడించారు.

దర్శకనిర్మాతలను సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో ఛాన్స్ లు అడుగుతున్నానని జరుగుతున్న ప్రచారం కూడా వాస్తవం కాదని ఆమె కామెంట్లు చేశారు. తనకు నటించే ఛాన్స్ లు కావాలని ఎవరినో అడగాల్సిన అవసరం లేదని ఆమె చెప్పుకొచ్చారు. తెలుగులో తాను తప్పకుండా సినిమాలు చేస్తానని సోనాలి బింద్రే కామెంట్లు చేశారు. అయితే ఈ మధ్య కాలంలో తెలుగులో ఏ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పలేదని సోనాలి బింద్రే తెలిపారు.

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీలో తాను నటిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆమె అన్నారు. సోనాలి బింద్రేకు తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. సోనాలి బింద్రే తెలుగులో రీఎంట్రీ ఇవ్వడంతో పాటు మరిన్ని సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఆమె అభిమానులు భావిస్తున్నారు. రెమ్యునరేషన్ కంటే కథకే ప్రాధాన్యత ఇస్తానని సోనాలి చెబుతుండటం గమనార్హం.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus