Sonu Sood: ఆ రూల్స్ ను సోనూసూద్ ఉల్లఘించారా..?

  • February 21, 2022 / 10:25 AM IST

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మెగా పోలింగ్ బూత్ వద్ద బాలీవుడ్ నటుడు, సామాజిక కార్యకర్త అయిన సోనూసూద్ ఎస్‌యూవీ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మెగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సోనూసూద్ సోదరి మాళవికా సూద్ పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన తన సోదరి మాళవిక కోసం మెగాలో క్యాంప్ చేస్తున్నాడు. అయితే మెగా జిల్లాలోని లంధేకే గ్రామంలో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుటున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు వచ్చింది.

Click Here To Watch

ఈ క్రమంలో వారు సోనూసూద్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాన్ని (ఎస్‌యూవీ) స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల పరిశీలకుల సూచన మేరకు వాహనాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఎస్‌డీఎం-కమ్-రిటర్నింగ్ అధికారి సత్వంత్ సింగ్ కూడా సోనూ సూద్ ఇంటిపై వీడియో నిఘాను ఆదేశించారు. ఈ మేరకు సినీ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ దేవీందర్ సింగ్ మీడియాతో మాట్లాడారు.అనుమానాస్పద కార్యాచరణ ఆధారంగా ఎస్‌యూవీని స్వాధీనం చేసుకున్నామని.. లంధేకే గ్రామంలోని పోలింగ్ బూత్ దగ్గర ఎస్‌యూవీ తిరుగుతున్నట్లు మాకు ఫిర్యాదు అందిందని..

దీంతో ఆ కారుని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అంతేకాదు సోనూసూద్ మోగాలో ప్రచారం చేస్తున్నప్పుడు ఆ వాహనాన్ని ఉపయోగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి, సోనూ సూద్‌కు మోగా నియోజకవర్గంలో ఓటు లేనందున ఆ ప్రాంతంలోకి వెళ్లడానికి వీల్లేదని.. ఇంట్లోనే ఉండాలని ఎస్‌డీఎం-కమ్-రిటర్నింగ్ అధికారి సత్వంత్ సింగ్ కూడా ఆదేశించారట.

అయితే సోనూ ఆ ఆదేశాలను ఉల్లంఘించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై స్పందించిన సోనూసూద్.. తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని.. ఇది కేవలం పార్కింగ్ సమస్య మాత్రమేనని.. కారు సరిగ్గా పార్క్ చేయలేదని చెప్పుకొచ్చారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus