బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇటీవల ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఎంతో ట్యాలెంటెడ్ హీరో.. మంచి కథల్ని ఎంచుకుంటూ హిట్లు మీద హిట్లు అందుకుంటున్న హీరో. సీరియల్స్ లో చిన్న చితకా పాత్రలు వేసుకుంటున్న స్థాయి నుండీ స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. అలాంటి హీరో చనిపోవడం వల్ల యావత్ భారత దేశ ప్రజలు దిగ్బ్రాంతికి గురయ్యారు. ‘బాలీవుడ్ లో ఉన్న నెపోటిజం వల్లే కొన్ని ప్రాజెక్టు ల నుండీ సుశాంత్ ను తప్పించడంతో అతను డిప్రెషన్ కు లోనయ్యి ఆత్మహత్య చేసుకున్నాడని’..
అక్కడి ప్రేక్షకుల బాలీవుడ్ స్టార్లను ట్రోల్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఎప్పుడూ అక్కడి స్టార్లను దుమ్మెత్తుపోసే హీరోయిన్ కంగనా రనౌత్ కూడా పెద్ద ఎత్తున ‘నెపోటిజం’ ఉందంటూ ఆరోపణలు చేసింది. తాప్సి వంటి హీరోయిన్లు ఆబ్జెక్ట్ చేస్తే వారిని కూడా విమర్శించింది. ఈ క్రమంలో సోనూ సూద్.. కంగనా తీరు పై మండిపడ్డాడు… ‘స్వార్ధం కోసం మరణించిన వాళ్ళని అడ్డుపెట్టుకోవడం కరెక్ట్ కాదు. సుశాంత్ ను ఒక్కసారి కూడా కలవని వాళ్ళు అతని గురించి అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నారు.
అతని మరణం గురించి మాట్లాడుతున్న వాళ్ళంతా కేవలం పబ్లిసిటీ కోసమే మాట్లాడుతున్నారు.వాళ్ళు సుశాంత్ ను వాడుకుంటున్న పద్ధతి నాకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు సోనూ సూద్. కంగనా తీరు వల్లే గతంలో ‘మణికర్ణిక’ సినిమా నుండీ సోనూ తప్పుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే.
Most Recommended Video
పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?