పెళ్లికి రావాలంటూ ట్విట్టర్లో సోనూసూద్ కు అమ్మాయి రిక్వెస్ట్..!

కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో మోహన్ లాల్ కష్టం అంటూ వచ్చిన జనాలను ఆదుకుంటూ ఉంటాడు. అటు తరువాత ఆ బాధ్యతను మన ఎన్టీఆర్ తీసుకుంటాడు. కష్టం అంటేనే చాలు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ కష్టాన్ని తీరుస్తూ ఉంటాడు. అయితే అలాంటి జనాలు నిజ జీవితంలో ఉంటారా? అంటే… ‘ఉన్నాడు… అతనే సోనూసూద్’..! వెయిట్.. వెయిట్.. ఇవన్నీ నేను చెబుతున్న డైలాగులు కాదు.

సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్లు ఇవి. సోనూసూద్ తన ట్విట్టర్ వేదికగా… ఎవరు ‘కష్టాల్లో ఉన్నాను’ అని మెసేజ్ చేసినా రెస్పాండ్ అవుతూ వస్తున్నాడు. కొంతమంది ఆకతాయి మూక కామెడీ చేస్తున్నా.. కోపం తెచ్చుకోకుండా ఓపికగా సమాధానం చెబుతూ వస్తున్నాడు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. తాజాగా ట్విట్టర్లో ‘తన పెళ్ళికి రావాలంటూ’ ఓ అమ్మాయి సోనూ సూద్ కు రిక్వెస్ట్ పెట్టింది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలోని నవాడా ప్రాంతానికి చెందిన కర్మన్ తోలాలో నివసిస్తున్న నేహా సహై అనే అమ్మాయి ఈ కోరిక కోరింది.

నేహా సోదరి దివ్య కడుపు నొప్పితో బాధపడుతుంటే సోనూ.. ఉచితంగా ఆమెకు శస్త్రచికిత్స చేయించాడట. ఇందుకోసమే సోనూ సూద్ ను ఆమె కోరినట్టు తెలుస్తుంది. దానికి సోనూ జవాబిస్తూ.. ‘కచ్చితంగా వస్తాను’ అంటూ సోనూసూద్ కూడా రిప్లై ఇచ్చాడు. ఇందుకు సోనూసూద్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus