రియల్ హీరో సోనూసూద్ ప్రజల కోసం చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్నీఇన్నీ కావు. సోనూసూద్ కు పద్మశ్రీ వస్తుందని ప్రజలు భావించినా కేంద్రం సోనూసూద్ కు పద్మశ్రీ ఇవ్వలేదు. సోనూసూద్ కు పద్మశ్రీ ఇవ్వాలని ప్రజల నుంచి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. కంగనా రనౌత్ పేరు పరిశీలనలో లేకపోయినా కేంద్రం ఆమెకు పద్మశ్రీ ఇచ్చిందని మీకు ఎందుకు ఇవ్వలేదని కొందరు సోనూసూద్ ను ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సోనూసూద్ సమాధానం ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు అవార్డులు వచ్చినా రాకపోయినా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని సోనూసూద్ అన్నారు.
22,000 మంది విద్యార్థులకు ఇప్పటివరకు తాను సహాయం చేశానని సోనూసూద్ తెలిపారు. రాజకీయ పార్టీ అయినా రాజకీయేతర పార్టీ అయినా పని చేసే స్వాతంత్రం ఎక్కడ ఉంటే ఆ ఫ్లాట్ ఫామ్ లో చేరతానని సోనూసూద్ వెల్లడించారు. రైతులకు కూడా తాను ఎప్పుడూ అనుకూలంగా ఉంటానని సోనూసూద్ పేర్కొన్నారు. మనం అన్నం తింటున్నామంటే దానికి కారణం రైతులే అని సోనూసూద్ తెలిపారు. తన సోదరి మాళవిక త్వరలోనే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తారని సోనూసూద్ అన్నారు.
తన సోదరికి అందరూ మద్దతు తెలపాలని సోనూసూద్ కోరారు. కాంగ్రెస్, ఆప్ పార్టీలు మంచి పార్టీలు అని సోనూసూద్ కామెంట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోనూసూద్ ఎలాంటి కామెంట్లు చేయలేదు. సోనూసూద్ కు సినిమా ఆఫర్లు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయని తెలుస్తోంది. సోనూసూద్ ను పాజిటివ్ పాత్రల్లో చూపించడానికి దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!