రియల్ హీరో సోనూసూద్ కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆస్పత్రిలో ఉన్న ఎంతోమంది కరోనా రోగులకు సరైన సమయానికి మందులు అందేలా చేసిన సంగతి తెలిసిందే. అయితే సోనూసూద్ మందులను అక్రమంగా కలిగి ఉన్నారని బాంబే హైకోర్టులో పిల్ దాఖలైంది. సోనూసూద్ ఆ పిల్ గురించి స్పందిస్తూ తాను మందుల కొనుగోలు విషయంలో తప్పుడు దారిలో వెళ్లలేదని చెప్పారు. తాను కేవలం మందుల పంపిణీ విషయంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నానని సోనూసూద్ అన్నారు.
కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో 45వేల మందికి భోజన సదుపాయం కల్పించానని సోనూసూద్ వెల్లడించారు. కంపెనీల సహకారంతో తాను ఏకంగా 3 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించానని సోనూసూద్ పేర్కొన్నారు. కరోనా రోగుల ఆధార్ కార్డు, కరోనా రిపోర్ట్, ప్రిస్క్రిప్షన్ అన్నీ పరిశీలించి ఆ మందులు లభ్యం కాకపోతే కలెక్టర్లు, ఎంపీలు, చీఫ్ మెడికల్ ఆఫీసర్లను సంప్రదిస్తున్నామని సోనూసూద్ వెల్లడించారు. ఫార్మసీ ఫ్రాంఛైజీలు, ఆస్పత్రులు తమకు మందుల విషయంలో సహకరిస్తున్నాయని సోనూసూద్ పేర్కొన్నారు.
నేతలకు, సంబంధిత అధికారులకు సమాచారం చేరవేసి అవసరం ఉన్నవాళ్లకు సాయం అందిస్తున్నామని సోనూసూద్ చెప్పుకొచ్చారు. బాంబే హైకోర్టు సోనూసూద్ అభ్యర్థన గురించి పిటిషనర్ అభ్యంతరాలను తర్వాతి వాదనకు వాయిదా వేయడం గమనార్హం. తనపై వచ్చిన ఆరోపణల విషయంలో నిజం లేదని సోనూసూద్ చెప్పకనే చెప్పేశారు. అడిగిన వెంటనే సోనూసూద్ సాయం చేస్తుండటంతో కొంతమంది ఆయన వైఖరిపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సోనూసూద్ తాజాగా ఇచ్చిన వివరణతో ఆయన అక్రమంగా మందుల పంపిణీ చేయలేదని తేలింది.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!