నాలుగు రోజుల పాటు తన ఇల్లు, ఆఫీసులపై జరిగిన ఆదాయపు పన్ను శాఖ దాడులపై నటుడు సోనూసూద్ స్పందించాడు. తన లావాదేవీలన్నీ చాలా పారదర్శకంగా ఉన్నాయని.. ఎంతలా అంటే ఒకే ఒక్క క్లిక్ తో తన లావాదేవీలు, ఖాతాలు అన్నీ చూడొచ్చని అన్నారు. తన ఆదాయ-వ్యయాలతో పాటు మేం అందించిన ప్రతి వ్యక్తి వివరాలు, వాళ్ల ఫోన్ నెంబర్లతో పాటు కంప్యూటర్ లో ఉన్నాయని చెప్పారు. తన ఫౌండేషన్ ద్వారా వేలమంది ప్రాణాలు కాపాడడమే కాదు.. ప్రతి పైసాకు లెక్క కూడా చెబుతున్నామని వివరించారు.
ఢిల్లీలో ఉన్న యాప్ కు మద్దతుగా నిలిచినందుకే తనపై ఐటీ దాడులు జరిగాయనే వాదనను సోనూ ఖండించాడు. రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలు పిలిచినా వెళ్తానని.. ఏపీ, తమిళనాడు ప్రభుత్వాలతో కూడా టచ్ లో ఉన్నానని తెలిపాడు. బీజేపీ తనపై కోపంగా ఉందని అనుకోవడం లేదని అన్నాడు. ఐటీ రైడ్స్ పై ఎలా స్పందించాలో తెలియడం లేదని.. ఓ పక్క మంచి పనులు చేస్తున్నాను.. మరోపక్క ఇలా జరుగుతున్నాయని అన్నారు. సేవా కార్యక్రమాలు మాత్రం ఆపనని..
ఆదాయపు పన్ను శాఖ అధికారులు వాళ్ల పని వాళ్లు చేశారు.. బా పని నేను చేస్తున్నా అంటూ బదులిచ్చారు. తనపై జరిగిన ఐటీ దాడులు మానసికంగా మరింత స్ట్రాంగ్ గా మార్చయంటున్నాడు సోనూసూద్. ఇప్పుడు తనపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందని అంటున్నాడు సోనూ.