సినిమాలలో విలన్ గా నటించినప్పటికీ నిజజీవితంలో హీరోగా అందరి చేత ఎంతో ప్రశంసలు అందుకున్నారు నటుడు సోనూ సూద్. కరోనా సమయంలో ఎంతోమందికి ఆపద్బాంధవుడుగా నిలిచిన ఈయన ఇప్పటికీ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నారు.ఇలా ఒకవైపు సినిమాలలో చేస్తూనే మరోవైపు సామాజిక కార్యక్రమాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సోను సూద్ నటించిన సామ్రాట్ పృథ్విరాజ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో సోను సూద్ చాంద్‌బర్దాయ్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాని బాగా కష్టపడి చేయడంవల్ల ఇంకా అద్భుతంగా తీయగలిగామని తెలిపారు.సినిమాలను ఎప్పుడూ కూడా ఫలితం ఆశించి చేయకూడదని మనం నటించే పాత్రకు వందశాతం న్యాయం చేయాలని ఈయన పేర్కొన్నారు. ఇలా ఫలితం ఆశించకుండా తన పాత్రకు ప్రతిభ కనబరచడం నటుడికి ఎంతో ముఖ్యమని,
విజయంతో పాటు పరాజయాలను కూడా స్వచ్ఛందంగా స్వీకరించాలని ఈయన వెల్లడించారు. మనం చేసిన తప్పులు నుంచి సరైన పాఠాలు నేర్చుకొని మరింత ప్రతిభను చూపించడం నటుడికి బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఇక సామ్రాట్ పృథ్విరాజ్ సినిమా విజయాన్ని పక్కన పెడితే ఇందులో తన పాత్ర ఎంతో ప్రత్యేకమైనదని ఈ సందర్భంగా సోను సూద్ ఈ సినిమా ఫలితం పై స్పందించారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?