లాక్ డౌన్ లో ప్రజలకు సేవలందించి వారిని ఆదుకున్నాడు నటుడు సోనూసూద్. ఇప్పుడు మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. తన జీవిత కథను స్వయంగా రాసుకుంటున్నారు సోనూసూద్. తన ఆటోబయోగ్రఫీకి టైటిల్ ని ఖరారు చేశారు. ఇంతకీ ఆ టైటిల్ ఏంటంటే ‘I Am No Messiah’. దీనికి అర్ధం ‘నేను మహానుభావుడిని కాదు’. లాక్ డౌన్ సమయంలో ప్రజలకు సోనూసూద్ చేసిన సేవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వలస కార్మికులను తమ ఇళ్లకు చేర్చడం దగ్గర నుండి స్టూడెంట్స్ కి మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు ఇవ్వడం, కొందరికి ఉద్యోగాలు ఇప్పించడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.
వేల కోట్ల సంపద ఉన్న వాళ్లే కరోనా టైంలో నామమాత్రంగా విరాళాలు ప్రకటించి ఊరుకుంటే.. సోనూసూద్ డబ్బు గురించి అసలు ఆలోచించకుండా ఆర్థికంగా చాలా మందిని ఆదుకున్నారు. సోనూసూద్ చేసిన ఈ సేవలకు గాను చాలా మంది ఆయన్ని దేవుడిగా కొలిచారు. అయితే ఇప్పుడు తన జీవిత కథను తనే స్వయంగా రాసుకోవాలని సూనుసూద్ నిర్ణయించుకోవడం.. దానికి ‘I Am No Messiah’ అనే టైటిల్ ఎంపిక చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ పుస్తకంలో కరోనా సమయంలో తన అనుభవాలను ప్రస్తావించనున్నారు సోనూ.
తన ఆటోబయోగ్రఫీకి ‘I Am No Messiah’ అనే టైటిల్ ను ఎందుకు ఎంపిక చేసుకున్నారనే విషయంపై సోనూసూద్ మాట్లాడారు. ప్రజలు చాలా మంచి వారని.. వారికి సాయమా చేసిన వారి పట్ల ఎంతో అభిమానం చూపిస్తారని.. అందుకే తనను ప్రేమతో మహామనిషిగా పిలుచుకుంటున్నారని అన్నారు. కానీ తను మాహానుభావుడిని కానని బలంగా నమ్ముతానని.. మనసుకి నచ్చింది చేస్తానని అన్నారు. ఒకరికొకరు తోడుగా ఉండడం.. ఒకరికొకరు సాయం చేసుకోవడం అనేది మనుషులుగా మన బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు. ఈ పుస్తకాన్ని డిసెంబర్ లో విడుదల చేయనున్నారు.
Most Recommended Video
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!