బాలీవుడ్ లో మన ముద్దుగుమ్మల హవా!

బాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో సౌత్ సినిమాలు సత్తా చాటుతున్నాయి. బాలీవుడ్ స్టార్స్ నటిస్తోన్న సినిమాలకు కనీసపు కలెక్షన్స్ కూడా రావడం లేదు. సక్సెస్ విషయంలో ఇప్పుడు బాలీవుడ్ ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. మళ్లీ పాత రోజులు వస్తాయని ఆశిస్తున్నారు బాలీవుడ్ నటీనటులు. సౌత్ సినిమాలు హిందీలో వర్కవుట్ అవుతుండడంతో.. అక్కడ తమ మార్కెట్ ను పెంచుకునే పనిలో పడ్డారు మన హీరోలు.

సౌత్ ముద్దుగుమ్మలకు కూడా బాలీవుడ్ లో మంచి ఎంట్రీనే దొరుకుతుంది. ఇది వరకు బాలీవుడ్ లో క్లిక్ అయిన హీరోయిన్లను సౌత్ కి దిగుమతి చేసుకునేవారు మన మేకర్స్. బాలీవుడ్ లో చోటా హీరోయిన్ కి కూడా సౌత్ లో కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు సీన్స్ రివర్స్ అయింది. సౌత్ హీరోయిన్స్ ను హిందీలో చూపించడానికి అక్కడి మేకర్స్ ఉత్సాహం చూపిస్తున్నారు.

సౌత్ లో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్లకు బాలీవుడ్ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇందులో భాగంగా నయనతార, రష్మిక, సమంత వంటి హీరోయిన్లకు బాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం రష్మిక చేతిలో మూడు, నాలుగు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. నయనతార.. ఏకంగా షారుఖ్ ఖాన్ తో జత కడుతోంది.

సమంత సినిమాలకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా.. వరుణ్ ధావన్ తో ఓ సినిమా కన్ఫర్మ్ అయిందని టాక్. సౌత్ లో స్టార్ స్టేటస్ పొందిన మరింత మందికి బాలీవుడ్ లో అవకాశాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు మరికొందరు హీరోయిన్లు హిందీ సినిమాల్లో నటించడానికి రెడీ అవుతున్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus