నయన్, హన్సిక లతో పాటు ఈ ఏడాది పెళ్లి చేసుకుని సెటిల్ అయిన సినీ సెలబ్రిటీలు..!

సాధారణంగా సినిమా వాళ్ళు తొందరగా పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే ఫ్యామిలీ లైఫ్ అనేది వాళ్ళ కెరీర్ పై భారంగా మారుతుందేమో అనే భయంతో..! అయితే వయసు మీద పడిపోతున్నప్పుడు వాళ్ళు కూడా తొందరపడతారు కదా అనుకుంటే అలా జరగడం లేదు..! కానీ కరోనా వల్ల లాక్ డౌన్ వచ్చినప్పటి నుండి చాలా మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి వైపు మక్కువ చూపిస్తున్నారు. 2022లో చాలామంది సినీ సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు మరికొంతమంది ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లికి రెడీగా ఉన్నారు.వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) అలియా భట్ – రణ్ బీర్ కపూర్ :

‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ 2014 లో మొదలైంది. అప్పటి నుండి ఈ జంట ప్రేమించుకుంటున్నారు. కొన్నాళ్ల పాటు డేటింగ్ లో ఉన్న ఈ జంట 2022 ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్నారు. ఓ పాపకు తల్లిదండ్రులయ్యారు కూడా.

2) నయనతార – విగ్నేష్ శివన్ :

7 ఏళ్ళుగా ప్రేమించుకుంటున్న ఈ జంట.. ఈ ఏడాది జూన్ 9న పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అప్పుడే సరోగసి పద్ధతిలో కవలలకు జన్మనిచ్చారు కూడా..!

3) హన్సిక :

తన చిన్ననాటి స్నేహితుడు అలాగే బిజినెస్ పార్ట్నర్ అయిన సోహెల్ కతూరియాతో.. హన్సిక పెళ్లి డిసెంబర్ 4న ఘనంగా జరిగింది.

4) గౌతమ్ కార్తీక్ – మంజిమా మోహన్ :

2019లో ‘దేవ‌ర‌ట్టం’ అనే సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ టైంలోనే వీరి మధ్య పరిచయం ఏర్పడటం… తర్వాత అది ప్రేమగా మారడం జరిగింది. ఈ ఏడాది(2022) నవంబర్ 28న వీరి వివాహం ఘనంగా జరిగింది.

5) నాగ శౌర్య :

అనూష శెట్టితో నాగ శౌర్య వివాహం నవంబర్ 19న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. బెంగళూరులో వీరి వివాహం జరిగింది.

6) వశిష్ఠ సింహ – హరి ప్రియా :

పిల్ల జమిందార్ తో పాపులర్ అయిన హరిప్రియ, కె.జి.ఎఫ్ తో పాపులర్ అయిన వసిష్ఠ సింహ.. పెళ్లి చేసుకోబోతున్నారు. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయ్యింది.మరికొద్ది రోజుల్లో వీరి వివాహం జరగనుంది.

7) మౌనీ రాయ్ :

‘బ్రహ్మాస్త్రం’ లో విలన్ గా చేసి పాపులర్ అయిన మౌనీ రాయ్… సూరజ్ నంబియార్ ను ఈ ఏడాది జనవరిలో పెళ్లి చేసుకుంది

8) పూర్ణ :

టాలీవుడ్ హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన పూర్ణ… షానిద్‌ అసిఫ్‌ అలీ అనే దుబాయ్ బేస్డ్ బిజినెస్మెన్ ను పెళ్లి చేసుకోబోతుంది.

9) డి.ఇమ్మాన్ :

‘విశ్వాసం’ ‘పెద్దన్న’ వంటి చిత్రాలకు సంగీతం అందించిన ఇమ్మాన్.. 2022 మే 16న అమేలీని రెండో వివాహం చేసుకున్నాడు.

10) రవి చంద్రశేఖరన్ – మహాలక్ష్మీ :

నిర్మాత రవి చంద్రశేఖరన్.. నటి మహాలక్ష్మీ.. ఇద్దరూ గతంలో పెళ్లి చేసుకుని విడిపోయిన వాళ్ళే. తర్వాత వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ ఏడాది పెళ్లి చేసుకుని ఇండియా వైడ్ హాట్ టాపిక్ అయ్యారు.

11) హరీష్ కళ్యాణ్ :

‘జెర్సీ’ సినిమాలో నాని కొడుకుగా.. నటించిన ఇతను నర్మదా ఉదయ్ కుమార్ ను ఈ ఏడాది పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయ్యాడు.

12) ఆది పినిశెట్టి – నిక్కీ గల్రాని :

2016 లో వచ్చిన ‘మలుపు’ సినిమా టైం నుండి ప్రేమించుకుంటున్న ఈ జంట.. ఈ ఏడాది మే నెలలో పెళ్లి చేసుకుని.. ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus