ఈ 5 మంది సౌత్ స్టార్లు హాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చారు..!

దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్న తర్వాత కొంతమంది నటీనటులు కేవలం ఇక్కడికి మాత్రమే పరిమితమైపోకుండా బాలీవుడ్లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ లిస్ట్ కాస్త పెద్దదే..! రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది. అయితే కొంతమంది స్టార్లు మాత్రం హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించి మరింతగా పాపులర్ అయ్యారు. వాళ్ళెవరో ఓ లుక్కేద్దాం రండి :

1) రజినీకాంత్ :

1988 లో వచ్చిన ‘బ్లడ్ స్టోన్’ అనే హాలీవుడ్ మూవీలో రజినీకాంత్ క్యాబ్ డ్రైవర్ పాత్రను పోషించాడు. డ్వైట్.హెచ్ ఈ చిత్రానికి దర్శకుడు. బ్రెట్ స్టైమిలీ మరియు అన్న నికోలస్ లు లీడ్ రోల్స్ లు పోషించారు.

2) ఐశ్వర్య రాయ్ :

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణించిన ఐశ్వర్యరాయ్.. 2007 లో వచ్చిన ‘ది లాస్ట్ లీజియన్’ తో హాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘ది పింక్ పాంతర్2’ తో సహా మరో రెండు చిత్రాల్లో కూడా నటించింది.

3) టబు :

ఇర్ఫాన్ ఖాన్ తో కలిసి ‘ది నేమ్ సేక్’ అనే చిత్రంతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది టబు. మీరా నాయర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసారు. అలాగే ‘లైఫ్ ఆఫ్ పై’ అనే మూవీలో కూడా కీలక పాత్ర పోషించింది.

4) నెపోలియన్ :

‘కుంతీ పుత్రుడు’ ‘హలో బ్రదర్’ వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు నెపోలియన్.. తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో స్టార్ గా ఎదిగాడు. అయితే ‘క్రిస్మస్ కూపన్’ అనే చిత్రం ద్వారా హాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. తర్వాత ‘డెవిల్ నైట్’ అనే మరో హాలీవుడ్ సినిమాలో కూడా నటించాడు.

5) ధనుష్ :

తమిళ్ లో స్టార్ అయిన ధనుష్ హిందీ, తెలుగు భాషల్లో కూడా పాపులర్ అయ్యాడు. అయితే ఇతను ‘ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫక్రి’ అనే చిత్రంతో హాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. అంతేకాదు త్వరలో రాబోతున్న ‘ది గ్రేమెన్’ అనే చిత్రంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus