శంకర్-చరణ్ సినిమా.. హీరోయిన్ ఈమేనా..?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుండి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ముందుగా ఈ సినిమా స్టోరీ పొలిటికల్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ అని వార్తలు వచ్చాయి. ఆ తరువాత అనిరుధ్ ని ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా కన్ఫర్మ్ చేశారని కోలీవుడ్ మీడియా వర్గాలు వార్తలు ప్రచురించాయి.

ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరోవార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ న్యూస్ ఏంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్ గా కొరియన్ బ్యూటీని తీసుకున్నట్లు టాక్. ముందు రష్మిక, పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించగా.. ఇప్పుడు కొరియన్ నటిని ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు. పలు టీవీ షోలు, సినిమాల్లో నటించి పాపులర్ అయిన బేసుజీ అనే నటిని రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు.

ఈ వార్త బయటకి రాగానే.. బేసుజీని ఇన్స్టాగ్రామ్ లో వెతికి మరీ ఫాలో అవ్వడం మొదలెట్టేశారు సినీ అభిమానులు. మరి దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు. అలానే ‘ఆచార్య’ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఇవి పూర్తయిన తరువాత శంకర్ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్‏తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus