సౌత్ స్టార్ డైరెక్టర్ల హవా మామూలుగా లేదుగా!

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. పాజిటివ్ టాక్ రాకపోవడం వల్ల కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతుంటే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన రాజమౌళి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఈ దర్శకుని ఖాతాలో ఒక్క ఫ్లాప్ కూడా లేదు. రాజమౌళి డైరెక్షన్ లో నటించాలని బాలీవుడ్ స్టార్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.

అయితే వేర్వేరు కారణాల వల్ల రాజమౌళి మాత్రం బాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే అక్కడ శంకర్ హవా కొనసాగుతోంది. శంకర్ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. శంకర్ మాత్రం బాలీవుడ్ స్టార్ హీరోలతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. శంకర్ సినిమాలకు బాలీవుడ్ లో కూడా క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కూడా వరుస హిట్లతో క్రేజ్ ను పెంచుకుంటున్నారు.

ఈ డైరెక్టర్ సినిమాలపై కూడా హిందీ ప్రేక్షకులు ప్రత్యేక దృష్టి పెట్టారు. శాండిల్ వుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు హిందీలో భారీగా క్రేజ్ ఉంది. కేజీఎఫ్2 హిందీలో ఫస్ట్ డే నుంచి రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే. దృశ్యం సిరీస్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ కు కూడా హిందీ హీరోలలో, ప్రేక్షకుల్లో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

సౌత్ డైరెక్టర్ల ప్రతిభకు, విజయాలకు బాలీవుడ్ స్టార్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం సౌత్ డైరెక్టర్ల హవా మామూలుగా లేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. సౌత్ స్టార్ డైరెక్టర్ల క్రేజ్ రోజురోజుకు పెరుగుతోందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus