ఎస్పీ బాలు ఇక లేరు, ఆయన పాటలను అభిమానులకు వదిలి మౌనంగా నింగికేగారు. ఐదు దశాబ్దాలకు పైగా బాలు తన మధుర గానంతో సంగీత ప్రియులకు సంతోషం పంచారు. నిన్న మధ్యాహ్నం బాలు మరణించగా నేడు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు పూర్తి కానున్నాయి. బాలు పార్దీవ దేహాన్ని నిన్న రాత్రి ఫార్మ్ హౌస్ కి తరలించడం జరిగింది. కాగా బాలు చనిపోవడానికి కొద్దిరోజుల ముందు తన విగ్రహాన్ని స్వయంగా చేయించుకున్నారు.
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన రాజ్ కుమార్ వడయార్ బాలు విగ్రహం తయారు చేశారు. బాలు తన తల్లితండ్రుల విగ్రహాలు రాజ్ కుమార్ వడయార్ తో చేయించారు. ఆ రెండు విగ్రహాలు రాజ్ కుమార్ వడయార్ అద్భుతంగా తీర్చిదిద్దారు. దీనితో తన రికార్డింగ్ స్టూడియోలో ప్రతిష్టించడానికి తన విగ్రహం కూడా చేయాలని రాజ్ కుమార్ ని ఆయన కోరారు. ఇక శిల్పం పూర్తి అయిన తరువాత రాజ్ కుమార్ బాలు గారికి ఫోన్ చేసి చెప్పడంతో పాటు శిల్పం ఫోటో పంపించారు.
అది చూసిన బాలు చాలా బాగుంది అన్నారు. ఎటువంటి మార్పులు చేయవద్దు, కలర్ కూడా మార్చవద్దు చక్కగా కుదిరింది అన్నారు. ఇక విగ్రహాలకు సంబంధించిన ఖర్చుల వివరాలు కూడా తనకు తెలియజేయాలని బాలు రాజ్ కుమార్ కి ఫోన్ లో చెప్పారు. ఆ ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Most Recommended Video
బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!