తనపై వచ్చిన రూమర్స్ ఖండించిన ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం!

సోషల్ మీడియా కొంతమంది సెలబ్రిటీలకు ఆనందాన్ని పంచుతుంటే, మరికొంతమందికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. తమ గురించి లేనిపోనివి షికారు చేస్తుంటే.. స్వయంగా వారే వచ్చి వివరణ ఇవ్వాల్సివస్తోంది. తాజాగా ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం ఆ పరిస్థితిని ఎదుర్కొన్నారు. బాలు అనారోగ్యానికి గురయ్యారని, ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. తన ఆరోగ్యం మెరుగ్గా ఉందని చెప్పారు.

పేస్‌బుక్‌లో వీడియోలో బాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ” సోషల్‌మీడియాలో నా ఆరోగ్యం బాగాలేదని కొందరు పుకార్లు పుట్టించడంతో.. మీ ఆరోగ్యం ఎలా ఉందంటూ నా స్నేహితులు అడుగుతుంటే షాక్ అయ్యా. దగ్గు.. జలుబు లాంటి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినపుడు అక్కడ నన్ను చూసిన కొందరు ఆరోగ్యం బాగాలేదని అనుకోని ఉంటారు. ఇక మరోవైపు నేను ప్రదర్శనలకు దూరంగా ఉండటానికి కారణం నా సోదరి గిరిజ ఆకస్మిక మరణం. దీని తర్వాత సెప్టెంబర్ 2న బెంగళూరులో ఓ ప్రదర్శన కూడా ఇచ్చాను. దయచేసి అనవసరంగా ఇలాంటి వదంతులు సృష్టించి భాద కలిగించకండి. ప్రస్తుతం నేను రామోజీ ఫిలింసిటీలో ‘స్వరాభిషేకం’ షూటింగ్‌లో పాల్గొంటున్నా” అని స్పష్టం చేశారు. దీంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus