Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » ‘కొడాలి నాని’ ముఖ్య అతిధిగా గుడివాడలో గాన గంధర్వుడు ‘బాలు’ విగ్రహావిష్కరణ 11 న!

‘కొడాలి నాని’ ముఖ్య అతిధిగా గుడివాడలో గాన గంధర్వుడు ‘బాలు’ విగ్రహావిష్కరణ 11 న!

  • February 9, 2021 / 04:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘కొడాలి నాని’ ముఖ్య అతిధిగా గుడివాడలో గాన గంధర్వుడు ‘బాలు’ విగ్రహావిష్కరణ 11 న!

పద్మశ్రీ , పద్మభూషణ్, పద్మ విభూషణ్, డాక్టర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం (బాలు ) విగ్రహాన్ని మొదటగా గుడివాడ పట్టణంలో నెలకొల్పడం అభినందనీయమని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) అన్నారు. స్థానిక రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని కళాకారుల సమాఖ్య అధ్యక్షుడు బీ రామమోహనరెడ్డి , కోశాధికారి విన్నకోట సత్యనారాయణ ( పద్మ మైక్ బుజ్జి ) , సభ్యులు లంకపల్లి ప్రకాష్ , బీవీ సత్యం , పీ శ్యామ్ తదితరులు కలిశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గుడివాడ పట్టణం రాజబాపయ్యచౌక్ లోని అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహం దగ్గర ఎస్పీ బాలు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు . బొమ్మినంపాడుకు చెందిన ప్రఖ్యాత శిల్పి అప్పారావు ఈ విగ్రహానికి రూపకల్పన చేశారన్నారు . ఈ నెల 11 వ తేదీ ఉదయం 11 గంటలకు జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలంటూ మంత్రి కొడాలి నానిని ఆహ్వానించారు.

ఎస్పీ బాలు సుదీర్ఘ ప్రస్థానంలో ఆరు జాతీయ , ఆరు ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు , ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని , 25 సార్లు ఉత్తమ జాతీయ గాయకుడిగా , ఉత్తమ సంగీత దర్శకుడిగా , ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా , ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలను అందుకున్నారన్నారు . తమిళనాడు , కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక పురస్కారాలను అందజేశాయన్నారు . ఎంతో మంది నూతన గాయనీ గాయకులను కళారంగానికి పరిచయం చేసిన ఎస్పీ బాలు విగ్రహాన్ని సమాఖ్య ఆధ్వర్యంలో నెలకొల్పుతున్నట్టు చెప్పారు.

అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ కళాకారులకు పుట్టినిల్లు గుడివాడలో ఎస్పీ బాలు విగ్రహాన్ని తన చేతులమీదుగా ఆవిష్కరించే అదృష్టం రావడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. తెలుగు , తమిళ , హిందీ , కన్నడ భాషల్లో దాదాపు 40 వేలకు పైగా పాటలను పాడి ఘంటసాల లేనిలోటు తీర్చిన మహాగాయకుడు ఎస్పీ బాలు అని అన్నారు . ఎస్పీ బాలు గాయకుడిగానే పరిమితం కాకుండా నిర్మాతగా , మ్యూజిక్ డైరెక్టర్ గా , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా బహుముఖ సేవలందించారన్నారు. అటువంటి కళాకారుని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న కళాకారుల సమాఖ్య నేతలను అభినందించారు. గుడివాడ ప్రాంతం నుండి ఎందరో కళాకారులు నాటక , సినీరంగాల్లో రాణి ప్రపంచస్థాయి ఖ్యాతినార్జించారన్నారు . గుడివాడ ప్రాంతం నుండి ఎన్టీఆర్ , ఏఎన్నార్ , కైకాల, ఘంటసాల వంటి ఎందరో కళాకారులు కళామతల్లి ముద్దుబిడ్డలుగా వెలుగొందారన్నారు . అంతటి చరిత్ర కల్గిన కళాకారుల వారసులుగా నేటికీ కళాకారుల సమాఖ్య తరపున అనేక మంది కళాకారులు కళారంగానికి సేవలందిస్తూ వస్తున్నారన్నారు. కళాకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు . కళాకారులు ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నా వాటిని తన దృష్టికి తీసుకురావాలని , వీటిని శాయశక్తులా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కళాకారుల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం జగన్మోహనరెడ్డికి కళాకారులంతా మద్దతుగా నిలవాలని మంత్రి కొడాలి నాని కోరారు!!

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kodali nani
  • #Nani
  • #SP Balasubrahmanyam
  • #SPB
  • #statue

Also Read

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

trending news

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

1 hour ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

2 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

2 hours ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

2 hours ago
Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

9 hours ago

latest news

Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

1 hour ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

2 hours ago
Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

4 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

6 hours ago
Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version