Pregnant Ladies Scenes: ఎమోషన్ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?
- October 22, 2026 / 12:14 PM ISTByFilmy Focus Desk
విలన్లను వారి రౌడీలను హీరో వచ్చి శత్రు సంహారం చేసినప్పుడు.. విచక్షణారహితంగా చంపడానికి ఓ లైసెన్స్ కావాలి. అంటే హీరో ఎంత క్రూరంగా ఆ రౌడీలను చంపినా ప్రేక్షకులు ‘హీరో కరెక్ట్‌గా చేశాడు’ అని అనుకోవాలి. దీని కోసం మన దర్శకులు ఆ రౌడీలు, విలన్లతో కొన్ని భయానక సన్నివేశాల్లో నటింపజేస్తారు. ప్రజల్ని చిత్ర హింసలు పెట్టడం, హీరో ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం లాంటివి చేయిస్తారు. ఎన్నో ఏళ్లుగా మన ఇండియన్ సినిమాలో ఇలాంటివి చూస్తూనే ఉన్నాం.
Pregnant Ladies Scenes
అయితే, గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితి ఇంకా మారుతోంది. రౌడీలు/ విలన్ల చేష్టలు చూస్తే ప్రేక్షకుడికి వారిపై కోపం రావడం కంటే.. ఇంత దారుణంగా ఆ సీన్ తీయాలా అనే కోపం దర్శకుడి మీద వచ్చేలా మారింది. ఎందుకంటే వారు ఇబ్బంది పెడుతోంది గర్భిణీ స్త్రీలను. కావాలంటే మీరే చూడండి. రీసెంట్‌గా వచ్చిన ‘జైలర్ 2’, అంతకుముందు వచ్చిన ‘రణబాలి’, దాని కంటే ముందు వచ్చిన ‘ప్యారడైజ్’. ఈ మూడు సినిమాల్లోనూ గర్భిణీలను హింసించే సీన్స్ ఎక్కువైపోయాయి.

ఆ సీన్ లేకపోతే సినిమా ఉండదా అంటే కచ్చితంగా ఉంటుంది అని చెప్పొచ్చు. మరి ఈ విషయంలో దర్శకులు నెల్సన్ దిలీప్ కుమార్, రాహుల్ సాంకృత్యాన్, శ్రీకాంత్ ఓదెల ఎందుకు ఆలోచించలేదో అర్థం కావడం లేదు. ఈ ముగ్గురి పేర్లు చెప్పామని వీరినే అడుగుతున్నట్లు కాదు. రీసెంట్‌గా ఈ ముగ్గురి సినిమాలు వచ్చాయి కాబట్టి. ఎన్నెన్నో సీన్స్ ఆపుతూ, సినిమాలను హోల్డ్‌లో పెడుతూ వస్తున్న సెన్సార్ బోర్డు ఈ సీన్స్ విషయంలో ఎందుకు ఊరుకుంటుందో వారికే తెలియాలి.
మహిళలను, కావాల్సిన వారిని ఇబ్బంది పెట్టినట్లు చూపించడం, దాని ద్వారా విలనీని పెంచి చూపించి.. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం ఓకే. కానీ ఇది ఎంతవరకు అనేది చూడాలి. లేకపోతే ఆ సీన్స్ కూడా ప్రేక్షకుల్ని థియేటర్లకు దూరం చేస్తాయి. ఎందుకంటే వారి చేతిలో రిమోట్, స్క్రోల్ బార్ ఉండవు కాబట్టి.














