ఫ్రెండ్లీ స్టార్ శ్రీకాంత్ విడుదల చేసిన సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ స్పార్క్ 1.O ప్రచార చిత్రం!!

ప్రీతి సుందర్, భవ్యశ్రీ, హితేంద్ర, రాము ముఖ్య తారాగణంగా అరుణోదయ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి సురేష్ మాపుర్ దర్సకత్వంలో ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా రూపొందిన సూపర్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ “స్పార్క్ 1.O” (ఒన్ పాయింట్ ఓ). పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న ఈ క్రేజీ క్రైమ్ ఎంటర్టైనర్ ప్రచార చిత్రాన్ని ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ విడుదల చేసి, చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. హితేంద్ర నటించి నిర్మించిన “స్పార్క్ 1.O ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. దర్శకుడు సురేష్ లో మంచి స్పార్క్ ఉందని ప్రశంసించారు!!

తమ అభ్యర్థనను మన్నించి తమ చిత్రం ట్రైలర్ లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్ కు కృతజ్ఞతలు తెలిపిన హితేంద్ర… అతి త్వరలో “స్పార్క్ 1.O” ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు!!

ఇద్దరు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ నడుమ సాగే వినూత్నమైన క్రైమ్ డ్రామాగా రూపొందిన “స్పార్క్ 1.O” చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, వి.ఎఫ్.ఎక్స్: నవీన్, ఫైట్స్: రమణ మాస్టర్, సినిమాటోగ్రాఫర్; గోపి (అమితాబ్), ఎడిటర్: అనిల్ కుమార్, నిర్మాత: వి.హితేంద్ర, దర్శకత్వం: సురేష్ మాపుర్!!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus