Spirit: ‘స్పిరిట్’ లీకులు షురూ..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పాన్ ఇండియా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘స్పిరిట్’. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో భారీ హైప్ సొంతం చేసుకున్న సినిమా ఇదే. ట్రేడ్లో భారీ అంచనాలు ఉన్న సినిమా కూడా ఇదే. ఈ మధ్యనే సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. పూజా కార్యక్రమాలకి మెగాస్టార్ చిరంజీవి అతిధిగా విచ్చేసి టీంకి బెస్ట్ విషెస్ తెలిపారు.

Spirit

అలాగే ఈ సినిమాకి త్రివిక్రమ్ తనయుడు, రవితేజ తనయుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పనిచేస్తుండటం మరో విశేషంగా చెప్పుకోవాలి. ఇదిలా ఉంటే.. ‘స్పిరిట్’ షూటింగ్ ఇలా స్టార్ట్ అయ్యిందో లేదో అలా ఓటీటీ రైట్స్ సేల్ అయిపోయాయి. నెట్ ఫ్లిక్స్ సంస్థ ‘స్పిరిట్’ డిజిటల్ రైట్స్ ను రూ.160 కోట్లకు కొనుగోలు చేసింది.ఈ మధ్య ఎంత పెద్ద సినిమాకి అయినా ఓటీటీ బిజినెస్ జరగడం చాలా కష్టంగా ఉంది.

అంతెందుకు ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ ‘ఫౌజి’ వంటి సినిమాలకి ఓటీటీ బిజినెస్ జరగలేదు. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు ‘స్పిరిటి’ పై ఉన్న క్రేజ్ ఎలాంటిదో.ఇన్ని గుడ్ న్యూస్..ల నడుమ ‘స్పిరిట్’ ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసే బ్యాడ్ న్యూస్ కూడా ఒకటి ఉంది. అదేంటంటే.. ‘స్పిరిట్’ షూటింగ్ స్టార్ట్ అయ్యి సరిగ్గా నెల రోజులు కూడా పూర్తికాలేదు.. అప్పుడే ఆన్ లొకేషన్ నుండి ప్రభాస్ లుక్ లీక్ అయ్యింది.

పోలీస్ డ్రెస్ లో ప్రభాస్ చూడటానికి చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నాడు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో షాట్ గ్యాప్లో ఏదో ముచ్చటిస్తున్నాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఇంకా 50 శాతం కూడా రికవరీ సాధించలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus