సలార్ 2, కల్కి 2898 మూవీలతో వరుసగా సూపర్ హిట్లు కొట్టిన ప్రభాస్, తెలుగు దర్శకుడు మారుతీ డైరెక్షన్లో హారర్ కామెడీ జానర్లో ‘రాజాసాబ్’ చిత్రంతో 2026 సంక్రాంతి బరిలో రిలీజ్ చేయబోతున్న సంగతి అందరికి తెలిసిందే. రీసెంట్ గానే ఫస్ట్ లుక్ , ఫస్ట్ సింగల్, కొన్ని పోస్టర్స్ తో మూవీ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్.
ఇది ఇలా ఉండగా నెక్స్ట్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేయబోయే ‘స్పిరిట్’ పూజ కార్యక్రమాలను ఈ మద్యే మెగా స్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చి స్టార్ట్ చేసారు. దానికి సంబందించిన గ్రూప్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. అయితే స్పిరిట్ మూవీ షూటింగ్ కి పక్కా ప్లానింగ్ తో సిద్ధమయ్యారు డైరెక్టర్ వంగ. వరుసగా రెండు నెలలు ప్రభాస్ తో షూటింగ్ ప్లాన్ చేసాడు అంట. ఇప్పటికే మ్యూజిక్ & బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కంప్లీట్ చేయించారని టాక్.
దీంతో ఈ మూవీని సమ్మర్ బరిలో రిలీజ్ చేయటానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. తొలిసారి ప్రభాస్ ఫుల్ టైం పోలీస్ పాత్రలో నటిస్తుండగా, హీరోయిన్ గా త్రిప్తి డిమ్రి చేస్తున్నారు.ఈ మూవీలో ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. టీ సిరీస్ భూషణ్ కుమార్ & భద్రకాళి పిక్చర్స్ ప్రణయ్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.