ఫలానా సినిమా షూటింగ్‌లో మమ్మల్ని పోలీసులు పట్టుకున్నారు, అరెస్టు చేయబోయారు అంటూ చాలామంది నటులు చెబుతూ ఉంటారు. ఆ మాటలు విన్నప్పుడు నిజమేనా అలా కూడా జరుగుతుందా అని అనుకుంటూ ఉంటాం. అయితే స్పై సినిమాలు, యాక్షన్ మూవీస్ చేసిన ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎలా అంటారా? దీనికి సమాధానం ఇటీవల నిఖిల్ చెప్పాడు. ‘స్పై’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నిఖిల్.. తమ షూటింగ్ సందర్భంగా జోర్డాన్‌లో జరిగిన విషయం చెప్పుకొచ్చాడు.
‘స్పై’ సినిమా గురించి చెబుతూ.. జోర్డాన్‌లో తమను పోలీసులు స్టేషన్‌కి తీసుకెళ్లిపోయిన విషయం గురించి చెప్పారు. ఆ సినిమాలో ఓ యాక్షన్ సీన్ కోసం జోర్డాన్‌లో షూటింగ్ చేశారట. ఆ తర్వాత డెడ్ సీ ప్రాంతానికి వెళ్లి తిరిగి వస్తుండగా వాళ్లు ప్రయాణిస్తున్న కారు కారణంగా పోలీసు స్టేషన్‌కి వెళ్లాల్సి వచ్చిందట. వాళ్లు అక్కడ రెంట్‌కి తీసుకున్న కారు ఎవరో దొంగిలించిందట. అయితే ఆ విషయం మరచిపోయో, లేక ఇంకొకటో కానీ పోలీసుల ముందు డ్రైవర్ ఆపాడట.
ఆ నెంబర్ ప్లేట్‌చూసి డౌట్ వచ్చి పోలీసులు చెక్ చేస్తే రీసెంట్ ఆ కారు పోయినట్లు కంప్లైంట్ ఉందట. దీంతో డ్రైవర్‌ను, నిఖిల్ అండ్ కో. ని పోలీసులు స్టేషన్‌కి తీసుకెళ్లారట. ఎందుకు తీసుకొచ్చారో కూడా తెలియని సమయంలో సినిమా టీమ్ అని చెబితే అప్పుడు సంబంధిత కాగితాలు అన్నీ తీసుకు రమ్మన్నారట. అలా టీమ్ వచ్చి చూపించిన తర్వాత గూగుల్ పేర్లతో వెతికి చూసి కన్‌ఫామ్ చేసుకున్నాక వదిలేశారట.
తాను ‘హ్యాపీడేస్’ సినిమాలో యాక్ట్ చేశానని నిఖిల్ చెబితే గూగుల్‌లో ఆ విషయం వెతికి కన్‌ఫామ్ చేసుకున్నారట. అలా ఆ సమయంలో స్టేషన్‌లో నిఖిల్, అభినవ్ గొమటం తదితరులు స్టేషన్‌కి వెళ్లారట. అంతే కాదు ఈ సినిమా పేరేంటి అని పోలీసులు డ్రైవర్‌ను అడిగితే ‘స్పై’ అని చెప్పబోయాడట. ఆ మాట వింటే ఏమనుకుంటారో ఏమో అని పేరు చెప్పలేదట. ఒకవేళ పేరు చెప్పి ఉంటే ఇంకెంత ఇబ్బంది అయ్యేదో అని నిఖిల్ నాటి విషయాల గురించి చెప్పుకొచ్చాడు.
అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!