మహేష్ స్పైడర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది!
- June 27, 2017 / 08:01 AM ISTByFilmy Focus
టాలీవుడ్ కి దసరా సెంటిమెంట్ చాలా ఎక్కువ… తెలుగు వాళ్ళకు పెద్ద పండగ అయిన దసరాకి అన్నింటితో పాటు తమ అభిమాన హీరోల సినిమాలు కూడా విందులాంటివే. అయితే అదే క్రమంలో మన బడా హీరోలు కూడా దసరా బరిలో నిలిచేందుకు, రికార్డుల మోత మోగించేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ఇదిలా ఉంటే అసలు మ్యాటర్ లోకి వెళితే…టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు, తొలి సారి భారీ బడ్జెట్ తో తెలుగు మరియు తమిళ బాషల్లో చేస్తున్న సినిమా ‘స్పైడర్’. ప్రముఖ దర్శకుడు మురుగుదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ ఎంతటి సంచలనం సృష్టించిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సినిమా ఫర్స్ట్ లుక్ నుంచి టీజర్ వరకూ కొత్తదనాన్ని చూపించిన ఈ సినిమా రిలీజ్ డేట్ ఎట్టకేలకు ఫిక్స్ చేసేసారు.
ప్రిన్స్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను ట్విటర్ వేదికగా ప్రముఖ నిర్మాత బీఏ రాజు తెలిపారు. దసరా బరిలో… అంటే 2017 సెప్టెంబర్ 27న ప్రిన్స్ టాలీవుడ్ పైకి స్పైడర్ లా దూసుకొస్తాడన్న మాట. మొత్తంగా చూసుకుంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో ఈ సినిమా బిజినెస్ పరంగానూ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది అనే చెప్పాలి…మరి ఈ భారీ సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















