Squid Game Season 2: డేజంరస్‌ వెబ్‌ సిరీస్‌ సెకండ్‌ పార్ట్‌ రెడీ.. నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పుడంటే?

చూస్తే భయం కలిగించేవి, కోపం తెప్పించేవి అయినా.. అలాంటి సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చూడటానికి ప్రేక్షకులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆ జోనర్‌ కంటెంట్‌ కోసం సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. అలాంటి సిరీస్‌ రికార్డులు కొట్టించింది ‘స్క్విడ్‌ గేమ్‌’. మూడేళ్ల క్రితం వచ్చిన ఈ సిరీస్‌కు చాలామంచి ఆదరణ దక్కింది. దానికి సీక్వెల్‌ ఉంటుంది అని అప్పుడే చెప్పినా.. ఆ తర్వాత షూటింగ్‌ అవుతుంది అని చెప్పినా.. ఇప్పుడు స్ట్రీమింగ్‌ డేట్‌ చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి ‘స్క్విడ్‌ గేమ్‌ 2’ సిద్ధమైంది. సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్‌ను డిసెంబర్‌ 26 నుండి ప్రసారం చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ వెల్లడించింది. అంతేకాదు ఈ సిరీస్‌ ఆఖరి సీజన్‌ను వచ్చే ఏడాదే రిలీజ్‌ చేస్తామని కూడా చెప్పేసింది. ‘స్క్విడ్‌ గేమ్‌’ తొలి సీజన్‌ 2021లో నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారమైన విషయం తెలిసిందే. పేదరికం కారణంగా ఎలాగైనా డబ్బులు సంపాదించాలని తెలియని, భయంకరమైన ఆటలు ఆడేందుకు 456 మందికి సిద్ధమవుతారు.

ఈ క్రమంలో వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? చివరకు ఎంతమంది మిగిలారు? అనేదే సిరీస్‌ కథ. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ సిరీస్‌ విడుదలైన 28 రోజుల్లోనే 1.65 బిలియన్‌ గంటల స్ట్రీమింగ్‌తో రికార్డు సృష్టించింది. తోటివారి ప్రాణాలు కాపాడేందుకు జరిగే సంఘర్షణ నేపథ్యంలో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు.. ఆ రోజుల్లో ప్రేక్షకులతో కంటతడి పెట్టించాయి. ఆ గేమ్స్‌ చూశాక భయం కూడా వేస్తుంది.

మరిప్పుడు రెండో సీజన్‌లో అంతకుమించిన భయం, ఎమోషన్స్‌ ఉంటాయి అని అంటున్నారు. ఇక తొలి సీజన్‌ ఆరు ఎమ్మీ అవార్డులను సొంతం చేసుకుంది. దీంతో ఈ కొరియన్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ రెండో భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈసారి స్క్విడ్‌ ఎలాంటి ఎమోషన్స్‌ని పంచుతుందో చూడాలి. అన్నట్లుగా ఆఖరి సీజన్‌ వచ్చే ఏడాది తీసుకొస్తారట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus