Sr NTR: సీనియర్ ఎన్టీఆర్ స్మారక నాణెం అమ్మకాల్లో రేర్ రికార్డ్.. ఏమైందంటే?

  • November 20, 2023 / 05:04 PM IST

దివంగత ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల నాణేన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ మింట్ లో తయారైన తొలి స్మారక నాణేం సీనియర్ ఎన్టీఆర్ దే కావడం గమనార్హం. ఈ నాణెం అమ్మకాల విషయంలో అరుదైన రికార్డ్ ను సాధించగా ఆ రికార్డ్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. కేవలం రెండున్నర నెలల్లో ఏకంగా 25,000 నాణేలు అమ్ముడవడం గమనార్హం.

ఇండియా గవర్నమెంట్ మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వీ.ఎన్.ఆర్ మాట్లాడుతూ దేశంలోనే ఇది సరికొత్త రికార్డ్ అని తెలిపారు. 1964వ సంవత్సరం నుంచి మన దేశంలో స్మారక నాణేల విడుదల ప్రారంభమైంది. గతంలో ముద్రించిన స్మారక నాణేలు రికార్డ్ స్థాయిలో 12,000 వరకు అమ్ముడవగా ఎన్టీఆర్ స్మారక నాణెం మాత్రం 25 వేల అమ్మకాలతో ఆ రికార్డును అధిగమించడం నందమూరి ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

రాబోయే రోజుల్లో ఈ స్మారక నాణెం మరిన్ని రికార్డులను క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ పై ఉన్న అభిమానం వల్లే ఈ స్థాయిలో నాణేలను కొనుగోలు చేయడం జరిగిందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. అత్యుత్తమ డిజైన్ ను ఎంపిక చేసి ఈ నాణేన్ని తయారు చేయించారని తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ నాణేన్ని చాలామంది కొనుగోలు చేశారని సమాచారం.

సీనియర్ ఎన్టీఆర్ (Sr NTR) ఖాతాలో ఇప్పటికే ఎన్నో రికార్డులు ఉండగా నాణేల్లో కూడా ఎన్టీఆర్ దే రికార్డ్ అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఆగష్టు నెల 28వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణేన్ని నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ నాణెంలో ఒకవైపు మూడు సింహాలు అశోక చక్రం ఉండగా మరోవైపు సీనియర్ ఎన్టీఆర్ చిత్రం ఉంటుంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus