Deepavali: ప్రశంసలొచ్చేశాయ్‌… ఇప్పుడు థియేటర్లలోకి వస్తోందీ సినిమా!

కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల కాకుండా అవార్డులు, రివార్డులు, ప్రశంసలు అందుకుంటూ ఉంటాయి. కొన్ని సినిమాలు అయితే జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నాక తర్వాత థియేటర్లలో వస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వం నుండి జాతీయ సినిమా పురస్కారం అందుకున్న తర్వాత మన దగ్గర రిలీజ్‌ అయిన సినిమాలూ ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు అనుకుంటున్నారా? అలా పలు జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద ప్రశంసలు పొందిన ఓ సినిమా వచ్చే నెలలో మన దగ్గర రిలీజ్‌ అవుతోంది.

ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్‌ తమిళంలో ‘కిడ’ అనే సినిమాను నిర్మించారు. ఇప్పుడు అదే సినిమాను తెలుగులో ‘దీపావళి’ పేరుతో రిలీజ్‌ చేస్తారట. ఇందాక చెప్పినట్లు ఈ సినిమా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ చలన చిత్రోత్సవాల్లో ఈ సినిమా ప్రదర్శితమైంది. ఆ సినిమాను నవంబర్‌ 11న థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు స్రవంతి మూవీస్‌ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేస్తున్నారట. స్రవంతి రవికిశోర్‌ నిర్మించిన తొలి తమిళ చిత్రం ఇదే కావడం గమనార్హం.

తాత, మనవడు, ఓ మేక చుట్టూ తిరిగే (Deepavali) ఈ సినిమాను ఆర్‌.ఎ.వెంకట్‌ తెరకెక్కించారు. పూ రాము, కాళీ వెంకట్‌, దీపన్‌, పాండియమ్మ ప్రధాన పాత్రధారులు. వాస్తవానికి దగ్గరగా ఈ సినిమా ఉంటుంది అని టీమ్‌ చెబుతోంది. బాల్యంలోని సంఘటనల స్ఫూర్తితో రూపొందిన చిత్రమిదని దర్శకుడు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లోని ఓ గ్రామం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందట. మూడు పాత్రల మధ్య భావోద్వేగాలు ప్రధానంగా రూపొందిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని టీమ్‌ చెబుతోంది.

నిర్మాత స్రవంతి రవికిషోర్‌ ఓసారి చెన్నై వెళ్లినప్పుడు ఓ స్నేహితుడి ద్వారా ఐదు నిమిషాలు ఈ సినిమా కథ విన్నారట. వెంటనే కనెక్ట్ అవ్వడంతో దర్శకుణ్ని కథ మొత్తం రికార్డ్ చేసి పంపమని అడిగారట. మొత్తం కథ నచ్చడంతో వెంటనే ఓకే చేసేశారట. అలా ఈ సినిమా పట్టాలెక్కింది అని చెప్పారు. మరి సినిమా సగటు ప్రేక్షకుణ్ని ఎలా మెప్పిస్తుందో చూడాలి.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus