‘శ్రీకారం’ దర్శకుడి కష్టాలు తెలుసా?

  • March 15, 2021 / 12:40 PM IST

వ్యవసాయం నేపథ్యంలో ఇటీవల వచ్చిన చిత్రం ‘శ్రీకారం’. ఈ సినిమాతో దర్శకుడు బి.కిశోర్‌ టాలీవుడ్‌కి పరిచయమ్యారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. మరి ఆ దర్శకుడిగా మారడానికి ముందు ఏం జరిగింది, ఎలా దర్శకుడు అయ్యారు. ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఇటీవల చెప్పుకొచ్చారు. రైతు సినిమా తీసి, సూపర్‌ అనిపించుకున్న కిషోర్‌ తొలినాళ్లలో దర్శకుడు అవుదామని అనుకున్నారట. ఆ మాట ఇంట్లో చెబితే కుటుంబ సభ్యులు కొట్టారట.

కిషోర్‌ది చిత్తూరు జిల్లా పెరుమాళ్లపల్లి గ్రామం. ఆయన తండ్రి రైతు. నేను కుకింగ్‌ అంటే ఇష్టం ఉండటంతో ఇంటర్‌ తర్వాత హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేయాలని కిషోర్‌ అనుకున్నారట. ఈ విషయం ఇంట్లో తెలిశాక అందరూ పెద్ద గోల చేశారు. దాంతో డిగ్రీ చదువుతున్నప్పుడు వ్యవసాయం చేద్దామని మళ్లీ నిర్ణయించుకున్నారట. అయితే అదీ కుదర్లేదట. ఆయన తెలిసిన వాళ్లు, బంధువులు బాగా చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డారట. దీంతో మన డైరక్టర్‌ కూడా అలానే ఉండాలని ఆయన తల్లిదండ్రులు అనుకున్నారట. అయితే అది ఆయనకు నచ్చలేదట. కొన్నాళ్లకు ఆయనకు సినిమా అంటే ఇష్టమని తెలుసుకుని వాళ్లే నన్ను ఇక్కడికి పంపించారట.

కిషోర్‌ డిగ్రీ చదివే సమయంలోనే సినిమా అంటే ప్యాషన్‌గా మారింది. కొన్నాళ్లు అసిస్టెంట్‌ డైరక్టర్‌గా పనిచేసి, షార్ట్‌ ఫిల్మ్‌ తీశారట. అలా చేసిన వాటిలో ‘శ్రీకారం’,‘శతమానం భవతి’ లఘుచిత్రాలకు మంచి పేరొచ్చింది. ‘శతమానం భవతి’తర్వాత సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే నేర్చుకోవాల్సింది ఇంకా ఉందనుకుని కొన్నాళ్లు ఆగారు కిషోర్‌. ‘శ్రీకారం’ షార్ట్‌ ఫిల్మ్‌ చూసి 14రీల్స్‌ ప్లస్‌ లో అవకాశం వచ్చింది. అలా ‘శ్రీకారం’ సినిమాతో దర్శకుడిగా మారాను అంటూ చెప్పుకొచ్చారు కిషోర్‌.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus