శర్వానంద్ ,ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘శ్రీకారం’. కిశోర్.బి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 11న శివరాత్రి కానుకగా విడుదలయ్యింది. మొదటి షో నుండీ ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. మంచి మెసేజ్ ఉన్నప్పటికీ.. టికెట్ రేట్లు పెంచెయ్యడం వలన ప్రేక్షకులు ఈ చిత్రాన్ని లైట్ తీసుకున్నారు. మొదటి రోజు పర్వాలేదు అనిపించినప్పటికీ తరువాత నుండీ బాగా డల్ అయ్యాయి ఈ చిత్రం కలెక్షన్లు.
ఇక ’14 రీల్స్ ప్లస్’ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట కలిసి నిర్మించిన ఈ చిత్రం 7 రోజుల కలెక్షన్ల వివరాలను ఓ సారి పరిశీలిస్తే :
నైజాం | 2.73 cr |
సీడెడ్ | 1.57 cr |
ఉత్తరాంధ్ర | 1.16 cr |
ఈస్ట్ | 0.72 cr |
వెస్ట్ | 0.49 cr |
గుంటూరు | 0.96 cr |
కృష్ణా | 0.49 cr |
నెల్లూరు | 0.32 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 8.44 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.30 cr |
ఓవర్సీస్ | 0.39 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 9.13 cr |
‘శ్రీకారం’ చిత్రానికి 17.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు 17.5కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.7 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 9.13 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కు ఇంకా 7.87 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ చాలా పెద్దది కాబట్టి.. ఇక బ్రేక్ ఈవెన్ కావడం కష్టమనే చెప్పాలి..!
Click Here To Read Movie Review
Most Recommended Video
శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!