ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో ‘క్రాక్’ ‘ఉప్పెన’ ‘జాతి రత్నాలు’ చిత్రాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. వీటిని కొనుగోలు చేసిన బయ్యర్లకు రెండింతల లాభాలు దక్కాయి. ‘క్రాక్’ విషయం పక్కన పెడితే.. ఇటీవల ‘ఉప్పెన’ ‘జాతి రత్నాలు’ చిత్రాలు ఓటిటిలో విడుదల అయ్యాయి. థియేటర్లలో ఈ చిత్రాలను మిస్ అయిన ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంతో వీటిని వీక్షించారు. అయితే వీరిలో చాలా మందికి ఈ సినిమాలు నచ్చలేదు. అందుకే సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు బోలెడన్ని మీమ్స్ కూడా చేస్తుండడం గమనార్హం. ‘ ‘ఉప్పెన’ చిత్రం కథ.. పాత చింతకాయ పచ్చడి’ అని.. గతంలో ‘అలాంటి కథలతో ఎన్నో చిత్రాలు వచ్చాయని..
ఇది బ్లాక్ బస్టర్ ఏంటి?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ‘జాతి రత్నాలు’ సినిమాకి అయితే ‘సిల్లీ టిక్ టాక్ వీడియోలు, జబర్దస్త్ ఆటో పంచ్ లు గుర్తుకు వచ్చాయి.. అన్ని కలెక్షన్లు ఈ సినిమాకి ఎలా వచ్చాయో’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. దినేష్ కార్తీక్ వంటి క్రికెటర్ ఈ సినిమాని పొగిడినా కానీ తిట్టే వాళ్ళ సంఖ్యనే ఎక్కువగా ఉండడం గమనార్హం. ‘ఉప్పెన’ ‘జాతి రత్నాలు’ చిత్రాలకు ముందు నుండీ ఏర్పడ్డ హైప్ కారణంగా భారీ కలెక్షన్లు వచ్చాయని.. కథ, కథనాలు చాలా వీక్ అని ఎంతో మంది విశ్లేషకులు ముందుగానే చెప్పారు. ఇదిలా ఉంటే.. విచిత్రంగా శర్వానంద్ ‘శ్రీకారం’ చిత్రానికి మాత్రం ఓటిటిలో మంచి రెస్పాన్స్ వస్తుండడం విశేషం.
ఈ చిత్రం థియేటర్లలో మాత్రం డిజాస్టర్ అయ్యింది. దానికి ముఖ్య కారణం… రాంగ్ టైం లో రిలీజ్ కావడం, అదే సంక్రాంతికి విడుదల చేసి ఉంటే కచ్చితంగా ఈ చిత్రం ఫలితం వేరేలా ఉండేదనే కామెంట్లు ఎక్కువ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచడం కూడా మైనస్ అయ్యింది. చెప్పాలంటే ఇది కూడా పాత కథే..! ఇదే థీమ్ తో ‘మహర్షి’ సినిమా వచ్చింది. కానీ ‘శ్రీకారం’ ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. ఉమ్మడి వ్యవసాయం అలాగే కరోనా లాక్ డౌన్ తరువాత రైతుల ఏ విధంగా పంటని మార్కెట్ చేసుకోవాలి అనే విషయాలను ‘శ్రీకారం’ లో చక్కగా చూపించాడు దర్శకుడు. ఏది ఏమైనా థియేటర్లలో సక్సెస్ అయిన సినిమాలకు.. ఓటిటిలో సక్సెస్ అయినా సినిమాలకు చాలా వ్యత్యాసం ఉంటుందని ఈ సినిమాలు స్పష్టంచేశాయి.
Most Recommended Video
‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!