Sreeleela: చదువు.. సినిమా…. కష్టం అనిపించడం లేదా? శ్రీలీల ఏం చెప్పిందంటే?

టాలీవుడ్‌లో పెద్ద హీరోల సినిమాల షూటింగ్‌లు అర్జెంట్‌గా ఆగిపోవాలి అంటే ఏం చేయాలి? ఏముంది ఏదో ఒక బంద్‌ రావాలి అంటారా? అంత అవసరం లేదు… జస్ట్ శ్రీలీలకు హాలీడే ఇస్తే సరి. ఈ మాట మేం అనడం లేదు. ఇండస్ట్రీ అంతా ఇదే మాట అంటోంది. టాలీవుడ్‌లో బిజియెస్ట్‌ యాక్ట్రెస్‌ ఆమెనేమరి. అందం, అభినయం, డ్యాన్స్‌.. ఇలా అన్ని ముఖ్య విషయాల్లో శ్రీలీలను కొట్టేవాళ్లు లేరు అని అంటుంటారు. మరి ఆమెకు వీటిలో ఏది ఇష్టం.

శ్రీలీల (Sreeleela) ప్రస్తుతం డాక్టర్‌ చదువుతున్న విషయం తెలిసిందే. ఇటు నటన, అటు చదువు అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తోంది. అయితే రెండింటా టాపర్‌ అని కూడా అంటారు. మరి రెండూ ఒకేసారి చేస్తున్నారు కదా ఇబ్బంది అనిపించడం లేదా? అని అడిగితే… యాక్టింగ్‌కి రెస్ట్‌ ఉన్నప్పుడు ఏదైనా చేయాలంటే పుస్తకాలే తీస్తాను. డాక్టర్‌ కావాలనేది చిన్నప్పట్నుండి నాకున్న ఏకైక బలమైన కోరిక అమ్మమ్మకు ఓసారి ఒంట్లో బాగోలేకపోతే… మా అన్నయ్య వచ్చి చిన్నపాటి వైద్యం చేస్తే క్షణాల్లోనే లేచింది. దాంతో అప్పుడే డాక్టర్ అవ్వాలని ఫిక్స్‌ అయ్యాను.

అయితే షూటింగ్‌లు, లేదంటే చదువు అనేలా ప్లాన్‌ చేసుకుంటున్నాను అని చెప్పింది శ్రీలీల. మరి మీ నటనకు ఎంత క్రేజ్‌ ఉందో, మీ డ్యాన్స్‌కు కూడా అంత క్రేజ్‌ ఉంది? రెండింటిలో మీ ప్రియారిటీ ఏది అని అడిగితే… డ్యాన్స్‌ అనేది నా కల. నటన నేర్చుకున్నది నాట్యం వలనే అని చెప్పింది. చిన్నప్పటి నుండీ భరతనాట్యం చేసేదానినని, నాట్యంలో కథ చెప్పాలంటే హావభావాలతోనే చెబుతుంటాం. అలా నటన అలవాటైంది.

నాట్యంలో కొన్ని హావభావాలు గంభీరంగా ఉంటాయి. కానీ సినిమా నటనకి వచ్చేసరికి అన్నిచోట్లా హావభావాలు అక్కర్లేదు. ఒక్కో సీన్‌లో, ఒక్కో సందర్భంలో ఒక్కోలా చేయాలి. కొన్నిసార్లు ముఖంలో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్‌ లేకపోయినా ఓ అర్థం ఉంటుంది. ఇలా ప్రతి సినిమాతో నటనలో ఏదో కొత్త విషయం నేర్చుకుంటూనే ఉన్నాను. అందుకే సినిమాల్లో దర్శకులు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా నటిస్తుంటాను అని చెప్పింది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus