Sreeleela : పాటకు ఇచ్చిన హైప్‌… సినిమాకు వస్తుందా శ్రీ‘లీలమ్మో’…

శ్రీలీల అనగానే… ఠక్కున గుర్తొచ్చేది డ్యాన్స్‌. టాలీవుడ్‌లో ప్రస్తుతం బెస్ట్‌ డ్యాన్స్‌ హీరోయిన్‌ ఎవరైనా ఉన్నారా అంటే ఆమె పేరే చెబుతారు. ఏంటో ఆమె డ్యాన్స్‌ చూస్తుంటే డ్యాన్స్‌ చేయడం ఇంత సులభమా అనిపిస్తుంది కూడా. అంతా జనాలను తన డ్యాన్స్‌ అనే మత్తులో పడేస్తోంది. ఆమె పాటలకు, మూమెంట్స్‌కు ఫిదా కాని కుర్రకారు అని చెప్పొచ్చు. అలాంటి శ్రీలీల ఓ పాటకు ఫిదా అయిపోయింది, ఆ పాట వింటుంటే సగటు కుర్రకారు చేసే డ్యాన్స్‌ చేయాలని అనిపించిందట.

అంతలా ఆమెకు నచ్చేసిన పాట ఏంటి అని అనుకుంటున్నారా? ఆమె పేరు మీద ఉన్న ‘లీలమ్మో..’ అనే పాట. ఆమె పేరు మీద ఉందనో, బీట్‌ బాగుందనో కానీ.. ఆ పాట వింటే ఆమెకు ఏకంగా నాగిని డ్యాన్స్‌ వేయాలని అనిపించిందట. ఈ విషయాన్ని ఇటీవల శ్రీలీలే చెప్పుకొచ్చింది. వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా రూపొందిన ‘ఆది కేశవ’ సినిమాలోని పాట అది. ఈ సినిమాను విడుదల చేస్తున్న నేపథ్యంలో చిత్రబృందం ఇటీవల ఈ పాటను ఓ ప్రెస్‌ మీట్‌ నిర్వహించి మరీ రిలీజ్‌ చేసింది. ఈ సందర్భంగానే శ్రీలీల అలా చెప్పింది.

‘ఆది కేశవ’ సినిమా నుండి ఇప్పటివరకు వచ్చిన రెండు పాటలూ మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా వచ్చిన ‘లీలమ్మో..’ పాట కూడా అదే స్థాయిలో ఊపు తీసుకొచ్చింది. శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌ కుమార్‌ స్వరాలందించారు. కాసర్ల శ్యామ్‌ పాటను రాయగా, నకాష్‌ అజీజ్‌, ఇంద్రావతి చౌహాన్‌ పాడారు. ఇక శేఖర్‌ మాస్టర్‌ డ్యాన్స్‌ కొరియోగ్రఫీ చేశారు.

‘లీలమ్మో…’ పాట అంటే నాకెంతో ఇష్టమైన పాట. పైగా నా పేరుతో (Sreeleela) పాటకు ఇచ్చిన హైప్‌… సినిమాకు వస్తుందా శ్రీ‘లీలమ్మో’… ఉన్న తొలి పాట ఇది. అందుకే నాకు మరింత స్పెషల్‌ సాంగ్‌ ఇది. ఈ పాటను థియేటర్‌లో అందరూ బాగా ఎంజాయ్‌ చేస్తారు. ఇది అసలైన మాస్‌ పాట అని నా ఫీలింగ్‌. పాట వినగానే నాగిని డ్యాన్స్‌ చేయాలనిపించింది అని శ్రీలీల చెప్పింది. అయితే ఇప్పటికే వరుస వాయిదాలతో ఈ సినిమా మీద బజ్‌ లేదు. ఇప్పుడు శ్రీలీల కామెంట్స్‌, సాంగ్స్‌తో అయినా బజ్‌ వస్తుందేమో చూడాలి. అన్నట్లు సినిమాను నవంబరు 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus